Sai pallavi: సినీ ఇండస్ట్రీ నుండి తప్పుకొని డాక్టర్ వృత్తిని చేపట్టడానికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.

Sai pallavi: కోలీవుడ్లో 2015లో ప్రేమమ్ అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యింది సాయి పల్లవి. 2017లో ఫిదా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సాయి పల్లవి హీరోయిన్ కాకముందు డాన్సర్. చిన్నప్పుడు నుండి డాన్స్ మీద మక్కువతో డాన్స్ నేర్చుకొని, పాఠశాలల్లో ఎన్నో స్టేజీల మీద నాట్య ప్రదర్శన ఇచ్చింది. అంతేకాకుండా ఈటీవీ డాన్స్ షో డీలో పాల్గొనింది. జార్జియాలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రేమమ్ చిత్రంలో అవకాశం రావడంతో సినిమాలలో నటనను ప్రారంభించింది.

అంతేకాకుండా తనకు నటన మీద ఆసక్తితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను పొందింది. తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్ లో, హైబ్రిడ్ పిల్ల అనే డైలాగుతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.

Sai pallavi
Sai pallavi

ఆ సినిమా కోసం ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని, తన క్యారెక్టర్ కు డైలాగ్స్ చెప్పుకుంది. అటు నటనలో, డ్యాన్స్ లో, చదువులో ఇలా అన్నిటిలో టాలెంట్ ఉండడంతో, అందరూ ఆమెను నిజంగానే హైబ్రిడ్ పిల్ల అని ప్రశంసించారు. 2017లో ఫిదా తర్వాత ఎంసీఏ, ఎన్జీకే, మారి 2, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ శ్యాంమ్ సింగారాయి, విరాటపర్వం, సినిమాలలో నటించింది. తాజాగా ఈమె గార్గి అనే సినిమాలో నటించింది. అంతేకాకుండా ఈమె బాలనాటిగా కూడా నటించింది.

ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే తన నాట్యం ద్వారా సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళ సినిమాలో కంగనా రౌనత్ పక్కన తన మొదటి సినిమాలో నటించింది. ఆ తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్ గా కసూరి మాన్ సినిమాలో నటించింది. చాలా గ్యాప్ వచ్చిన తర్వాత తిరిగి ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

తెలుగు, తమిళం, మలయాళం భాషలో నటిస్తూ, తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ, ముందుకు వెళుతుంది. ఈమె మంచి మంచి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వద్దు అని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసింది. గతంలో చిరంజీవి చెల్లెలుగా నటించమంటే, వద్దు అని రిజెక్ట్ చేసింది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో అవకాశాన్ని కూడా పక్కకు త్రోసివేసిందట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో గ్లామర్ షో తప్పక ఉంటుంది. అందువల్లనే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా విరాటపర్వం, గార్గి సినిమా తర్వాత ఒక సినిమా కూడా చేయలేదు. అయితే కమలహాసన్ నిర్మిస్తున్న సినిమాలో శివ కార్తికేయనుకు జంటగా నటించబోతుంది.

ఇవన్నీ పక్కన పెడితే సాయి పల్లవి గురించి గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే తన సినిమాలకు గుడ్ బై చెప్పి, వైద్య వృత్తిని కొనసాగించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన సొంతూరు లో ఒక హాస్పెటల్ కట్టిస్తున్నట్లుగా తెలుస్తుంది.

తను ఎంబిబిఎస్ పూర్తి చేసింది. అందువల్లనే హాస్పిటల్ కట్టించి డాక్టర్ మారాలని నిర్ణయించుకున్నట్లు ఉంది. అందుకే సినిమాలలో గ్యాప్ వచ్చినట్లుగా అందరూ అనుకుంటున్నారు. హాస్పిటల్ ను తను, తన చెల్లెలు పూజ కలిసి చూసుకుంటారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి పల్లవి నిజంగా సినిమాలకు దూరం కానుందా ?లేక వైద్య సేవలు చేస్తూ, సినిమాలలో నటిస్తుందా? అనే సందేహాలు అధికమయ్యాయి. అయితే ఈ విషయంపై సాయి పల్లవి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాయి పల్లవి నిజంగానే సినిమాలకు దూరం అవుతుందో? లేదో? తెలియాలంటే ఆమె నోరు విప్పే వరకు వేచి ఉండక తప్పదు. ఏది ఏమైనా తను ఇండస్ట్రీకి దూరం కానుంది, అనే వార్త సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker