బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు!!

బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. వై.నాగేశ్వరరావు యాదవ్ రాష్ట్ర గొర్రెల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు విజయవాడ కృష్ణలంకలోని రాణిగారి తోటలో ఆంధ్ర ప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యాలయంలో  వేదమంత్రాల మధ్య  పూజా కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగల్రావు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.నాగేశ్వరరావు యాదవ్ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డొక్కా శ్రీనివాస్ గారు ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా నరేష్ గారు ,సంయుక్త కార్యదర్శి గురుమూర్తిగారు, రాష్ట్ర కార్యదర్శి రామారావు గారు,జాతియ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు,జాతీయ బీసీ సంక్షేమ సంఘం నందికొటుకూరు అధ్యక్షులు కురుమూర్తి గారు,గోపి గారు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట,జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ:

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యాలయం సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య గారు చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, యువ ఇంచార్జ్ లను నియమించడం జరుగుతుంది. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి బీసీల సమస్యలు,డిమాండ్లు చట్టసభల్లో50% బీసీలకు రిజర్వేషన్లు,బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కై త్వరలో మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండం జరుగుతుంది.

76 సంవత్సరాల నుండి బీసీలను ఉపయోగించుకొని అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ బీసీల అభివృద్ధికై ఏ పార్టీ సరైన దృష్టి పెట్టలేదు. బీసీల బ్రతుకులు” ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ” అన్నట్లుగా ఉంది.

భారతదేశ జనాభాలో అధికంగా ఏపీలో జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు ఈరోజు అనేక వృత్తులలో దేశానికి సంపద సృష్టిస్తూ పని చేస్తూ ఉన్నారు. బీసీల స్థానిక సంస్థలలో ఉన్న 34 శాతం రిజర్వేషన్ను  24 శాతం కుదించడం ఇది చాలా బాధాకరమైన విషయం. బీసీల అంటే ఎందుకు అంత చిన్న చూపు, ఎన్ని గుండెలు ఉంటే బీసీలకు అన్యాయం చేస్తారు.అలాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ  మాదిరిగానే బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి.

మా బిసి ఓట్లను వేయించుకుని గద్దె ఎక్కిన అధికార పార్టీలన్నిటికీ బీసీ ల జనాభా  56% జనాభాను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలలో, రిజర్వేషన్ ల లోను, న్యాయం చేయాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లు కల్పించాలి. ఉద్యోగ ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి .అన్ని ప్రభుత్వ లను ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి ను డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో 5 కోట్లతో బిసి భవనాలు మంజూరు చేశారు కానీ ,ప్రస్తుత ప్రభుత్వం వాటిని వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు కానీ వాటికి ఇంత వరకు  విది, విధానాలు లేవు .వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని బీసీలకు ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే చెల్లించాలి. బీసీ హాస్టల్లో మినాలరల్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయాలి.బీసీ కుల వృద్ధులకు ప్రోత్సహించి వారికి తగిన ఆర్థిక సాయం అందింప చేయాలి. కోవిడ్  టైంలో ఆర్థికంగా చిన్నాభిన్నమైన బిసి కుటుంబాలను గుర్తించి వారికి తగు విధంగా 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker