Indian 2: రామ్ చరణ్ సినిమా వాయిదా వేసి, కమలహాసన్ సినిమా పూర్తి చేయాలనుకున్న శంకర్

సాధారణంగా కొన్నిసార్లు ఏం జరిగినా కూడా మన మంచికే అని అనుకోవాల్సి వస్తుంది. ఇటీవల విడుదలైన కార్తికేయ 2 అందుకు ఒక ఉదాహరణ. ఆ యొక్క చిత్రం వాయిదా పడడం చివరకు అది మంచిదే అయింది. సరైన టైమింగ్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది ఈ చిత్రం. దీని కంటే ముందు రావాల్సిన 18 ముందు వాయిదా పడడం కూడా మంచిది సక్సెస్ వేడుక తర్వాత అది రావడం బిజినెస్ పరంగా బాగా ప్లస్ అవుతుంది.

రామ్ చరణ్ సినిమా వాయిదా వేసి, కమలహాసన్ సినిమా పూర్తి చేయాలనుకున్న శంకర్

ఇక కమలహాసన్ సినిమా ఇండియాన్ 2 విషయంలోనూ ఆలస్యంగా కొంచెం మేలు చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు రెండేళ్లు పూర్తి కావాల్సిందే. 2020లో విడుదల అవ్వాల్సింది. కానీ ఆ ఏడాది ఆరంభంలో షూటింగ్లో జరిగిన క్రైన్ ప్రమాదం వల్ల సినిమా తాత్కాలికంగా వాయిదా పడుతూ వచ్చింది. అది అనుకున్న టైమ్ కి ప్రకారం పూర్తయి ఉంటే కోవిడ్ టైంలో ఎలా రిలీజ్ అయ్యి ఎలా ఫలితం వస్తుందో.

అంచనా వేయలేకపోయేవాళ్ళం. రెండేళ్లు ఆగిన ఈ షూటింగ్ ఎట్టకేలకు మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది.మంగళవారం అర్ధరాత్రి ఒక అదిరిపోయే ఇండియాన్ 2 పోస్టర్ ద్వారా కమల్ హాసన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో వైట్ డ్రెస్ లో కమలహాసన్ ఒక మంచి లుక్ అదిరిపోయిందని చెప్పవచ్చు.

ఇంతకు ముందు వరకు లైకా అనే ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఇప్పుడు కమ్ ఎమ్మెల్యే ఉదయ్ నిధి స్టాలిన్ అనే సంస్థ రెడ్ చేంజ్ అనే మూవీ కూడా దీనికి తోడుగా ఉండింది. ఇకపై పెట్టుబడి అంతా ఈ సంస్థ పెట్టే విధంగా కనిపిస్తోంది. విక్రమ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కమల్ నుంచి రాబోయే సినిమా కావడంతో ఇండియన్ 2 ఒక్కసారిగా హైప్ పెరిగిపోవుడంతో సందేహం లేదు.

విక్రమ్ కంటే ముందు కరోనా టైంలో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాపై ప్రతికూల ప్రభావం ఉండేది కాదేమో. వాయిదాల వల్ల వడ్డీల భారం పడి ఉండవచ్చు. ఆ మేరకు ఇప్పుడు వచ్చే హైప్ నష్టాన్ని భర్తీ చేయడమే కాక అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది. రామ్ చరణ్ చిత్రాన్ని పక్కన పెట్టిన మరి శంకర్. ఈ చిత్రాన్ని తెరవేగంగా పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వేసవికాలంలో ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నది సమాచారం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker