Shivani Rajasekhar: క్లారిటీ ఇచ్చిన శివాని రాజశేఖర్

Shivani Rajasekhar: టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోయిన్లు కూడా వారసత్వంగానే ఎంట్రీ ఇచ్చి, తనదైన శైలిలో నటిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు.

లోకనాయకుడు కమల్ హాసన్ కూతుర్లు శృతిహాసన్, అక్షర హాసన్ కూడా వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వీరిలాగే టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే!

తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్స్ వినిపించడంతో ఈమెపై ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అదేమిటో కాదు! శివాని టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వచ్చిన వార్తలు ఇండస్ట్రీలోనే హార్ట్ టాపిక్ గా మారాయి.

Shivani Rajasekhar movie
Shivani Rajasekhar movie

రాజశేఖర్ పెద్ద కూతురు శివాని అద్భుతం అనే సినిమా ద్వారా, హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో విడుదల చేశారు. సినిమా మంచి హిట్ కొట్టడంతో శివానికి వరుస ఆఫర్లు వచ్చాయి.

ఈసారి హీరో రాజ్ తరుణ్ తో నటించిన ఆహనా పెళ్ళంట సినిమా కూడా ఓటీపీ ద్వారా, జి ఫైవ్ లో విడుదల చేశారు. తనతో ప్రేమలో పడిందని, వీరు వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాలని ఒక వార్త వైరల్ అయింది. దీంతో ఈ వార్త అక్కడ ఇక్కడ తిరిగి చివరికి శివాని దగ్గరకు చేరింది.

వెంటనే ఈ విషయంపై స్పందిస్తూ రాజ్ తరుణ్ తో కలిసి నటించాను. అతను ఒక మంచి నటుడు. నాకు బెస్ట్ ఫ్రెండ్. అతడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని కామెంట్స్ చేసింది. దీంతో ఈమె చెప్పిన మాటలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

Shivani Rajasekhar movie
Shivani Rajasekhar movie

తమ మధ్య అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన తల్లిదండ్రులే తన పెళ్లి గురించి మాట్లాడడం లేదు. మీకు ఎందుకు? అంత తొందర. ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉన్నా అంటూ చెప్పుకోచ్చింది.

అలాగే గతంలో తను ఎవరితోనో ప్రేమించి, అతనితో వెళ్లిపోయిందని పుకార్లు సృష్టించారు. ఇలాంటి వాటివల్ల నేను ఇంకా ధైర్యంగా ముందడుగు వేస్తాను. వెనక్కి తగ్గను అంటూ చెప్పుకొచ్చింది.

ఈ విషయాన్ని పక్కకు పెడితే శివాని కూడా తండ్రి బాటలోని నడుస్తుంది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ అయ్యేదాన్ని యాక్టర్ అయ్యానని చెబుతుంటారు.అలాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఎంబిబిఎస్ పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో యాక్టింగ్ చేస్తుంది.

అంతేకాకుండా అది కొద్దిగా కాలంలో కుర్రకారును ఉర్రూతలు ఊగించిన పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల, ఆకాంక్ష సింగ్, అదితి శంకర్, ఐశ్వర్య లక్ష్మి, మానుసి చిల్లర్, రూప కొడవయూర్, అదితి గోవిద్రిక లాంటి వారిలో శివాని రాజశేఖర్ కూడా ఉంది. ఒకవైపు డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ కొనసాగిస్తుంది.

ఇక తన చెల్లెలు అయిన శివాత్మిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. ఇద్దరు పోటీపడి మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. దీంతో శివానిపై వచ్చిన వార్తలకు chek పెట్టింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker