Shurti Hassan: గుర్తుపట్టలేనంతగా మారిన శృతిహాసన్.

Surti Hassan:టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. ఈమె వారసత్వంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె. హీరోయిన్ అలాగే సింగర్ కూడా శృతిహాసన్ చిన్నతనం నుండే పాటలు పాడుతూ ఉండేది. అలాగే 2000 సంవత్సరంలో హే రామ్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనను కొనసాగించింది.

అయితే 2009లో లక్ అని హిందీ సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో 2011లో వచ్చిన ఓ మై ఫ్రెండ్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్, క్రాక్ వంటి సినిమాలలో స్టార్ హీరోలతో నటించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.

Shurti Hassan
Shurti Hassan

అంతేకాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది. 2021లో వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అంతేకాకుండా గాయనిగా కూడా మెప్పించి, ఫిలింఫేర్ అవార్డులను పొందింది. అలాగే ఉనీయే పోల్ ఒరువన్ సినిమా ద్వారా సంగీత దర్శకురాలుగా మారి, ఉత్తమ సంగీత దర్శకురాలుగా అవార్డును అందుకుంది.

జీవితంలో తండ్రిని అనుసరిస్తూ ముందుకు వెళుతున్న, శృతిహాసన్ కు ఇప్పుడు అనారోగ్య సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తను ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు స్టార్ హీరోయిన్కు ఏమైంది? ఆమె ముఖం ఎలా ఈ విధంగా మారిపోయిందని, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మామూలుగానే హీరోయిన్లు ఎక్కువ శాతం మేకప్ లేకుండా కనిపించరు. తాము మేకప్ లేకుండా తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేయడానికి ఇష్టపడరు. అలాంటిది శృతిహాసన్ మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా, తను మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆమె ఇంత ధైర్యంగా పోస్టులు పెట్టినందుకు అభిమానులు కూడా ఆమెను మెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం ఈమె పెట్టిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఆ ఫోటోలను సేర్ చేస్తూ, తనకు ఫీవర్, సైనస్ తో బాధపడుతున్నానని, బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలలో తన ముఖం బాగా ఉబ్బిపోయి ఉంది. బాగా డల్ గా కనిపిస్తుంది. అందువలన అందరూ ఏమయింది? ఇలా మారిపోయిందని మెసేజెస్ చేస్తున్నారు. ఎలా ఉన్నా అభిమానులు మెచ్చుకుంటారని శృతి నిరూపించింది. ఎందుకంటే మరికొందరు అభిమానులు ఆమె చేసిన పనికి ప్రశంసిస్తున్నారు.

ఎందుకంటే చాలామంది స్టార్స్ తాము మేకప్ లేకుండా, అనారోగ్యంగా ఉన్నప్పుడు వారి విషయాలు బయటకు చెప్పరు. వాళ్ళు ఆ సమయంలో ఎలా ఉన్నారో? కూడా బయటకు చూపించరు. అలాంటిది తను ఫీవర్, సైనస్ తో బాధపడుతున్నను అంటూ, తన ఒరిజినల్ ఫేస్ తో ఫోటోలను పోస్ట్ చేయడం అంటే చాలా సాహసంతో కూడుకున్నది. ఇలా పోస్ట్ చేయాలంటే ధైర్యం ఉండాలి.

అలాంటి సాహసాన్ని శృతి అవలీలగా చేసింది. శృతిహాసన్ వెరీ గుడ్ అంటూ తన అభిమానులు మెచ్చుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా అంతట ఆమె ఫోటోలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ సాలార్ సినిమాలో నటించబోతుంది. అంతేకాక బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటించబోతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker