సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ జంటగా చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల ఓ చిత్రం నిర్మిస్తోంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
పోస్టర్లో సంతోష్, గౌరి దగ్గరగా నుంచొని.. కళ్లు మూసుకుని ప్రేమ తన్మయత్వంలో మునిగి ఉన్నట్లుగా కనిపించారు బ్యాగ్రౌండ్లో ఓ రంగుల ఇళ్లు చూపించారు. ‘‘సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఓ అందమైన ప్రేమకథతో రూపొందుతోంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేస్తామని చిత్ర బృందం తెలియజేసింది.