Sudigali Sudheer:మళ్లీ జబర్దస్త్ రాబోతున్న సుడిగాలి సుదీర్

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ అనే పేరుకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుదీర్ రియల్ పేరు సుధీర్ ఆనంద్ భయానా. అయితే తను నటన ప్రారంభించినప్పుడు సుడిగాలి సుదీర్ పేరు వచ్చింది. సుదీర్ సొంత ఊరు విజయవాడ. తండ్రి పేరు దేవ్ ఆనంద్ భయానా, తల్లి పేరు నాగరాణి భయానా.

సుధీర్ కి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. సుధీర్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పోవే పోరా, డి ,సూపర్ సింగర్ జూనియర్స్ ప్రోగ్రాంలో కనిపించాడు. 2017లో 2010లో జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ లో 2013 నుండి టీం లీడర్ గా మారి సుడిగాలి సుదీర్ఘ పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీ మొత్తం సుధీర్ ను సుడిగాలి సుదీర్ అని పిలుస్తారు.

జబర్దస్త్ ద్వారా మంచి ప్రదర్శనలు ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు జబర్దస్త్ తర్వాత చాలా రకాల షోలలో యాంకర్ గా, టీం లీడర్ గా చాలా చేశాడు. అంతేకాకుండా చాలా ఈవెంట్లలో కూడా కనిపించాడు.జబర్దస్త్ లో 9 ఏళ్లు చేసిన తర్వాత మల్లెమాల నుంచి బయటికి వచ్చేసాడు. తన నటన ప్రదర్శనతో సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. దాదాపుగా 30 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశాడు.

Sudigali Sudheer family
Sudigali Sudheer family

2019లో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా కూడా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2020లో త్రీ మంకీస్ సినిమా చేశాడు. ప్రస్తుతం గాలోడు అనే సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గాలోడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని తన మనసులో మాటలను చెప్పాడు.

సుదీర్ కు సినిమా స్టార్స్ కు ఉన్నంత ఇంస్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. సుధీర్ ఇంస్టాగ్రామ్ కు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సుధీర్ కు ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి సూపర్ శ్రీను, ఆటో రాంప్రసాద్ క్లోజ్ ఫ్రెండ్స్.తాజాగా సుధీర్ గాలోడు అనే సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

సినిమాలో క్యారెక్టర్ రియల్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, సినిమాలో మాస్ లుక్ లో కనిపిస్తానని చెప్పాడు. అందులో సుదీర్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుపుతున్నాడు. సినిమా మంచి కథతో కూడుకున్నదని స్టోరీస్, మరియు ఎంటర్టైన్మెంట్ ఉన్నందున ఈ సినిమా తీశానని అన్నాడు. అంతేకాక గాలోడు డైరెక్టర్తో ఈ సినిమా తర్వాత మరొక మూవీ చేస్తారని కూడా చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాను, నేను ప్రస్తుతం జబర్దస్త్ కు దూరం కాలేదు. తిరిగి మళ్ళీ జబర్దస్త్ వస్తాను అని అన్నాడు. తాను సడన్గా జబర్దస్త్ నుంచి బయటికి రాలేదని, తనకు ఉన్న కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది వల్లే ఆరు నెలలు గడువు కావాలని, మల్లమాల ప్రొడక్షన్స్ వారిని అడిగి, వారి పర్మిషన్ ద్వారానే బయటకు వచ్చానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న సుధీర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తను యాంకర్ గా చేసిన సింగింగ్ షో ద్వారా తను చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. తనకు మెగాస్టార్, సూపర్ స్టార్ గారంటే ఎంతో ఇష్టమని వాళ్ళని ఇన్స్పిరేషన్ గా గా తీసుకుంటానని, నా జీవితం అంతా ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే అని తన జీవిత లక్ష్యాన్ని చెప్పాడు. అంతేకాకుండా తనకు రష్మీకి మధ్య ఉన్న బంధం షోలకే పరిమితం,

అంతేకానీ రియల్ లైఫ్ లో అలాంటిది లేదని అదేవిధంగా ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఒకవేళ ఆ టైం వస్తే అందరినీ అర్థం చేసుకొని, సర్దుకుపోయేవారు అయితే బాగుంటుందని చెప్పాడు.తను జబర్దస్త్ లో నటించకపోయినా వాళ్ళ అభిమానం ఇంకా నా పైన ఉందని, ఇంతటి అభిమానం, ఆశీర్వాదం ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇంత అదృష్టం పొందాను అని అన్నాడు.

Sudigali Sudheer
Sudigali Sudheer

నాకు సంబంధించి ప్రేమ అంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేది, అదే విధంగా ఎంతోమంది జనాలు నా నుంచి ఏమీ ఆశించకుండా తనను అభిమానిస్తున్నారు, ప్రేమ అంటే ఇదే! స్వార్థం లేనిది ప్రేమ అని చెప్పుకొచ్చాడు.తనను బయట కలిసినప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ పలకరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

నేను అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అభిమానించడం చూసి నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ సంతోషాన్ని చూసినప్పుడు జీవితానికి ఇది చాలు అనిపిస్తుందని చెప్పకు వచ్చాడు.లదక్ లో సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు కొందరు తనను చూసి గుర్తుపట్టారని, వారు పూణే నుంచి వచ్చామని చెప్పారు.

వాళ్లకి తనంటే ఎంతో ఇష్టం అని చెప్పారని చెప్పాడు. నేను మీకు ఎలా తెలుసు? అని అడగగా, మీ పేరు సుధీర్, డీ షో ద్వారా మాకు తెలుసు. మీ గురించి రష్మీ గారి గురించి చాలా వీడియోలు చూసామని చెప్పారని చెప్పాడు. అప్పుడు చాలా సంతోషపడ్డాను.

నాకు జీవితంలో ఎక్కువ సంతోషం కలిగిన విషయం అదే! అని తన మనసులోని మాటను ప్రేక్షకులతో పంచుకున్నారు. నేను మెగాస్టార్, రజనీకాంత్ గారి ఇన్స్పిరేషన్ తో వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మెగాస్టార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, అని చెప్పాడు.

నాలాగే ఎంతోమంది సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరికీ త్వరగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను, నేను ఇంతటితో ఆగను, ఎప్పటికీ ప్రేక్షకులకు సంతోషాన్ని అందిస్తూ ఉంటానని, తన మనసులోని హావ భావాలను బయటపెట్టాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker