సైరాభాను కు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక

దివంగత నటుడు దిలీప్ కుమార్ భార్య సైరాభాను ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో వివిధ ఆరోగ్య కారణాల వల్ల చేరారు. అయితే ఆమెను మూడు రోజుల క్రితమే హాస్పిటల్ కి తరలించారు. ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించారు. మూడు రోజుల క్రితం రక్తపోటు సమస్య వచ్చిందని ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో చేరిందని కొన్ని వార్తలు వస్తూ ఉంటే, గుండెపోటు వచ్చిందని మరి కొన్ని వార్తలు వస్తున్నాయి.


టైమ్స్ నౌ నివేదిక ప్రకారం మూడు రోజులు అయినా ఆరోగ్యం పడిపోవడంతో ఐ సి యు లో చేర్చారు. ఈ నివేదికల ప్రకారం ఆమె శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు . ఆమె ఆక్సిజన్ స్థాయిలు నిరంతరం తగ్గుతూ వస్తుందని సమాచారం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది . కాగా తన భర్త దిలీప్ కుమార్ జూలైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రేమించే భర్త దూరం కావడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు.


గుండె పోటే కారణమా ?
సీనియర్ నటి సైరాభాను కు మూడు రోజుల క్రితం స్వల్ప గుండెపోటు కారణంగా నే హిందుజా ఆస్పత్రికి తరలించబడ్డారు అని తాజా వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి బాగానే ఉందని, కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉన్నారని సమాచారం.
తన ఫ్యామిలీకి దగ్గరి బంధువు అన్ని విషయాలు వెల్లడిస్తూ ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది . ప్రాథమిక పరీక్షల తర్వాత ఆమె గుండెపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారు .ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని , అయితే అది గుండెపోటు అనేది కాకపోవచ్చు అని అంటున్నారు .

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker