The Ghost Movie: త్వరలో OTT లో విడుదల

సినిమా ఫీల్డ్ కు సంబంధించి ఎప్పటినుంచో హీరోగా నటిస్తూ, ఇటు కొన్ని షోలను యాంకర్ గా చేస్తూ హోస్ట్ చేస్తూ సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తున్నాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్6 తెలుగు షో కు హోస్ట్ గా చేస్తూ, మరోవైపు సినిమాలు చూస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కు సంబంధించి తన తీసిన ఒక కొత్త మూవీ విడుదల అయ్యి ఓ టి టి కి రెడీగా ఉంది.

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ త్రిల్లర్ మూవీ”ది ఘో స్ట్”. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా మంచి అంచనాల మీదుగా అక్టోబర్ ఐదు న విడుదల అయింది. ఈ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్. సినిమా ఇప్పటికే థియే ట్రి కల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఓటిపి విడుదలకు రెడీ అయింది.ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా సోనాల్ చౌహన్ నటిస్తున్నారు.

ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై అభిమానుల ద్వారా ఓకే అనిపించుకుంది.ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన వారు–హీరోగా అక్కినేని నాగార్జున, హీరోయిన్ గా సోనాలి చౌహన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, రవి వర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ దాస్ నా రంగ్, సునీల్ నా రంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లతో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.

The Ghost  Movie: త్వరలో OTT లో విడుదల
The Ghost Movie: త్వరలో OTT లో విడుదల

కానీ ఈ సినిమా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమా ఇప్పటికే థియేట్రీకల్ రన్ పూర్తిచేసుకోవడంతో స్ట్రిమ్మింగ్ విషయంలో ఈ కార్యక్రమంలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీపీ రైట్స్ ని ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లెక్స్ కైవసం చేసుకుంది. సినిమా నవంబర్ రెండో తారీకు నుంచి స్ట్రిమ్మింగ్ కానుంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదలైంది. సినిమా థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా ఓటీడీలో ఎలా ఆకట్టుకుంటుందో అని అభిమానులు అనుకుంటున్నారు.

ఈసినిమాకు సంబంధించి తెలంగాణ+ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో మొదటిరోజు 3.60 కోట్ల రూ. గ్రాస్ వసూలు చేసింది. నాగార్జున నటించిన సినిమాక ఇంత తక్కువ కలక్షన్స్ రావడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున పక్కన కాజల్ అగర్వాల్ నటించాల్సి ఉండగా ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల ఆమె ప్లేస్ లో సునాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఈ సినిమా చేయడానికి ఆరు కోట్ల రూపాయలు వరకు తీసుకున్నాడట నాగార్జున.

ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ టీవీ దక్కించుకుంది.సోగ్గాడే చిన్నినాయన తర్వాత నాగార్జునకి పెద్దగా హిట్ రాలేదు. వైల్డ్ డాగ్ సినిమా తో పలకరించి కొంతవరకు ఎంటర్టైన్ చేశారు. తర్వాత బంగారాజు సినిమా ద్వారా మెల్లగా మల్ల క్రేజ్ ను పెంచుకున్నాడు నాగార్జున. అదే హుషారుతో ప్రణీత్ సత్తార్ డైరెక్షన్లో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 22 కోట్ల రూపాయలు రాబట్టాలి కానీ ఈ సినిమా అంత రావటం లేక చేతులు ఎత్తేసింది.ఈ సినిమాలో నాగార్జున ‘రా ‘ఏజెంట్ పాత్రలో వావ్ అనిపించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయట. ఈ సినిమాలో నాగార్జున మరోసారి యాక్షన్ హీరోగా కనిపించారు.

ఈ సినిమాని అక్టోబర్ 5న విడుదల చేశారు. 1998లో ఇదే రోజున నాగార్జున, రాంగోపాల్ వర్మతో తీసిన ‘శివ ‘సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందించింది.తరహాలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది అని భావించి ఈ సినిమాను అదే రోజున విడుదల చేయడం జరిగింది. కానీ వాళ్ళు అనుకున్న అంచనాలను ఈ సినిమా అందుకో లేకపోయింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker