#Boycott Liger: విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో అలా చేయడానికి కారణం ఏంటి?
బాయ్ కాట్ బాలీవుడ్ ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ఇది. బీ టౌన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఈసీ ఈ సినిమా బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడు లైగర్ సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించారని సమాచారం.
పూరి జగన్నాథ్ సినిమా అంటే చెప్పనవసరం లేదు. ఎందుకనగా ఆయన తీస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా ఉంటుంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చాలా బాగుంటుంది అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ సమయంలో లైగర్ బాయ్ కాట్ సెగ తగిలిoది.
దీనికి కరణ్ జోహార్ ఒక కారణమైతే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మరో కారణమని తెలుస్తుంది. పూరి కనెక్ట్స్ తో కలసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్ బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు.అయితే ఇక మరోవైపు ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డ,బాయ్ కాట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారుని కామెంట్స్ చేసి అమీర్ ఖాన్ కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది.
దీనికి తోడు ఒక ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి ఆన్సర్ ఇవ్వడం వివాదస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ boycotliger అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.అయితే విజయ్ దేవరకొండ కి మర్యాద లేదు అంటూ కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు. అలా మీడియా ముందు కాళ్లు టేబుల్ పైకి పెట్టి మాట్లాడడం అమర్యాదగా ఉంది అని భావిస్తున్నారు.