“ఏయ్ పిల్లా”అంటువస్తున్న హీరో ఎవరో తెలుసా?

సినీ ప్రపంచంలోకి వచ్చే హీరో, హీరోయిన్ల జాబితా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొత్త కొత్త హీరో హీరోయిన్లు రావడం ఏదో ఒక చిన్న తరహా సినిమా ద్వారా హిట్ కొట్టడం మామూలైన విషయమే. ఇదిలా ఉండగా వారసత్వంగా హీరో ఇంటి నుండి సినీ ఇండస్ట్రీలోకిమరికొందరు అడుగు పెడుతుంటారు.

వాళ్ళు అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని తండ్రి కొడుకులు గాని తల్లి కూతురుగా అలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఈ జాబితాలోకి తాజాగా మరొక హీరో జత అయ్యాడు. ప్రస్తుతం ఇప్పుడున్న హీరోలలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే ఈ లిస్టులోకి తాజాగా చేరినది మాధవ్ భూపతి రాజు.

ఇంతకీ హీరో ఎవరో అని అనుకుంటున్నారా ఈ యువ హీరో ఎవరో కాదు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాస్ మహారాజా రవితేజ సోదరుడు కుమారుడు. రవితేజ సోదరుడు రఘు కూడా హీరోగా, ఆర్టిస్టుగా అనేక సినిమాలలో నటించారు. ఇప్పుడొచ్చే ఈకొత్తయువహీరోఆయనకుమారుడే.

మాధవ్ భూపతి రాజును హీరోగాతీసుకొని వచ్చేది ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి). ప్రస్తుతం ఈయన ఒక సినిమానునిర్మించబోతున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై మంచి ఫుల్ లవ్ స్టోరీ ఉండే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏయ్ పిల్ల అనే టైటిల్ ని కూడా నియమించారు. ఈ సినిమా ఎంతో ఆకర్షనీయంగా గుండెకు హత్తుకునే అందమైన ప్రేమ కథ చిత్రం గా ఉండి ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని ఇస్తుందన్నారు.

సెప్టెంబర్ నెల నుంచి షూటింగ్ పనులు ప్రారంభించాలని అన్ని సిద్ధం చేసుకున్నట్లుగా నిర్మాత తెలిపారు. ఏయ్  పిల్ల అనే ప్రేమ కథ చిత్రంలో మాధవ్ భూపతి రాజు హీరోగా అతని సరసన తాజాగా మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబెన్ శకావత్ నటించనున్నారు. కథానాయకునిగా భూపతి రాజుకు కథానాయక రూబేన్ శకావత్ కు ఇది తొలి చిత్రం.

ఈ సినిమాకు దర్శకుడు రమేశ్ వర్మ కథను అందిస్తుండడం ఎంతో విశేషం. ఈ సినిమా ద్వారా లుదిర్ బైరెడ్డి నూతనంగా దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. మిక్కీ జేమేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు శ్యా మ్ కే నాయుడు కెమెరామెన్ గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ సినిమాకు అన్వర్ డైలాగ్స్ ను అందించారు. ఆర్ట్ డైరెక్టర్గా చిన్న వ్యవహరిస్తాడు. ఎడిటర్ గా ప్రసన్న తన సేవలను ఈ సినిమాకు అందించనున్నాడు. అని చిత్ర నిర్మాత ఈ సినిమా గురించి వెల్లడించారు.

ఇప్పుడున్న హీరో, హీరోయిన్లు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని స్టార్ హీరో, హీరోయిన్లుగా నిలిచారు. అదే విధంగా భూపతి రాజు కూడా పై స్థాయికి ఎదగాలని మనమందరం ఆశిద్దామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker