గూగుల్లో ఎక్కువగా శోధించిన చిత్రాల జాబితాలో ఉన్న టాప్ టెన్ మూవీస్
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి 2020, 2021 సంవత్సరం కరోనా కారణంగా భారీగా నష్టపోయింది. కరోనా కారణంగా ఎలాంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాక సినీ పరిశ్రమ చాలా రోజులు మూతపడింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చలనచిత్ర పరిశ్రమ 2022 సంవత్సరంలో కొంత ఊపిరి పీల్చుకుంది.
ఈ సంవత్సరంలో ఎక్కువ మొత్తం సినిమాలు థియేటర్లలోనే నేరుగా రిలీజ్ కావడం, కొన్ని సూపర్ డూపర్ హిట్ కావడం, మరికొన్ని అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు మనసులకు చేరుకోలేకపోవడం జరిగింది. కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, మరికొన్ని చిత్రాలు భారీ అంచనాలతో విడుదలై కొన్ని రికార్డ్స్ ని సొంతం చేసుకున్నాయి.
పెద్ద పెద్ద చిత్రాలు కూడా అనేక వాయిదాలు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి వీటికి విశేష ఆదరణ లభించి కలెక్షన్ల వర్షం కురిపించింది. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్ మూవీస్ ని రెండేళ్ల కరోనా టైం ముగిసిన తర్వాత నేరుగా థియేటర్లలో చూసి ఆ మూవీస్ కి బ్రహ్మరథం పట్టారు.
అభిమానులు చాలా ఆనందంతో ఈ మూవీస్ చూడడం జరిగింది. అంతే కాకుండా ఈ మూవీస్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి గూగుల్ లో కూడా వెతకడం జరిగింది. ఈ టైంలోనే గూగుల్లో ఇండియాలోనే అత్యధికంగా వెతికిన జాబితాలో కొన్ని చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
2022 సంవత్సరంలో గూగుల్ లో అత్యధికంగా వెతికిన చలనచిత్రాల్లో బాలీవుడ్ కి చెందిన సూపర్ హిట్ అయిన బ్రహ్మాస్త్రం మూవీ అన్నింటికంటే ముందుంది. రెండో ప్లేస్ లో కేజిఎఫ్ 2 ఉంది. చిన్న చిత్రంగా వచ్చి, ఎన్నో గొడవల తర్వాత రిలీజ్ అయ్యి భారీగా హిట్ అందుకుని రిలీజ్ అయిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. ఈ మూవీ గురించి కూడా గూగుల్లో ఎక్కువగా శోధించడం జరిగింది. కాబట్టి ఈ మూవీ థర్డ్ ప్లేస్ లో ఉంది.
ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అందుకున్న, విశేష జనాదరణ పొందిన మూవీ ఆర్ ఆర్ ఆర్ తో పాటు రిషబ్ శెట్టి సొంత డైరెక్షన్లో వచ్చిన మరో కొత్త సంచలన రికార్డు సృష్టించిన కాంతారా మూవీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి.
గూగుల్ లో అత్యధికంగా వెతికిన చిత్రాల్లో ఏ ఏ మూవీ ఏ స్థానాల్లో ఉందో తెలుసుకుందాం:-
1). బ్రహ్మాస్త్ర-మొదటి భాగం – శివ
2). కేజీఎఫ్ -చాప్టర్ 2
3). కశ్మీర్ ఫైల్స్
4). ఆర్ ఆర్ఆర్
5). కాంతార
6). పుష్ప-ది రైజ్
7). విక్రమ్
8). లాల్ సింగ్ చద్దా
9). దృశ్యం 2
10). థోర్- లవ్ అండ్ థండర్