Vijay,Ajith: సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విజయ్, అజిత్ మూవీస్
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ లలో విజయ్, అజిత్ లు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వీరిద్దరికీ సంబంధించిన రెండు మూవీస్ సంక్రాంతి కానుకగా ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే.
విజయ్ సినిమాలు ప్రతిదీ కూడా సూపర్ హిట్ అందుకోవడంతో విజయ్ సినిమాలకి ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది. అదే టైంలో అజిత్ విషయానికి వస్తే ఈయనకు సంబంధించిన మూవీస్ కి విజయ్ మూవీస్ కి జరిగినంత గా బిజినెస్ జరగడం లేదు.ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నాయి.
కాబట్టి వీటిని రిలీజ్ చేయడానికి అడుగుతూ ఉన్నప్పటికీ విజయ్ సినిమాకే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ప్రస్తుతం. ప్రజెంట్ విజయ్ “వారసుడు “అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కేరళలో ఈ మూవీకి సంబంధించి 6.6 కోట్లతో బిజినెస్ జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లోనే అజిత్ నటించిన” తునివు”అనే మూవీకి ప్రస్తుతం ఎలాంటి బిజినెస్ జరుగుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. విజయ్ సినిమా తో పోల్చితే అజిత్ సినిమాకి ఆ ప్రాంతంలో కేవలం 2.5 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగింది. దీన్ని బట్టి చూస్తే వారసుడు మూవీ కంటే కూడా తునివు మూవీ బిజినెస్ మూడో వంతు మాత్రమే ఉందని తెలుస్తుంది.
మిగతా అన్ని ప్రాంతాల్లో వారసుడు మూవీస్ తో ఈ మూవీని పోల్చితే బిజినెస్ చాలా తక్కువగానే ఉందని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా కలెక్షన్స్ పరంగా అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.