Vijay Deverakonda: అవయవ దానం
Vijay Deverakond a:టాలీవుడ్ స్టార్లలో ఒకరైన విజయ్ దేవరకొండ గురించి మనకు తెలుసు. విజయ్ మొదటి సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. విజయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పవచ్చు.
అంతేకాదు బాలీవుడ్ భామలు, మరియు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా విజయ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అయితే విజయ్ గీతగోవిందం ద్వారా కూడా మంచి హిట్ సాధించాడు. ఆ సినిమాలో రష్మిక తో కలిసి నటించాడు. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా నటి రష్మిక తో కలిసి నటించాడు. తాజాగా విజయ్ సమంతతో కలిసి ఖుషి 2 సినిమాలో నటిస్తున్నాడు. అయితే సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఈ టైంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.
రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అంత హిట్ కొట్టలేదు. దీంతో ఈసారి నటించే సినిమా పెద్ద హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. గీతా గోవిందం సినిమాకు పరశురాం దర్శకత్వం చేశాడు. ఇప్పుడు మళ్లీ అతని దర్శకత్వంలో క్లాసికల్ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు.
బాలల దినోత్సవం సందర్భంగా మాదాపూర్ లోని ఫేస్ హాస్పిటల్ లో జరిగిన ఒక కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి విజయ్‌తో పాటుగా మలావత్ పూర్ణ వచ్చారు. ఫేస్ హాస్పిటల్ లో బాలల దినోత్సవం జరుపుకుంటూ, హాస్పిటల్ యజమాన్యం ఆధ్వర్యంలో, చిన్న పిల్లల కాలే మార్పిడి అనే విషయంపై అవగాహన సదస్సును ఏర్పరిచారు.
ఆ సదస్సుకు హాజరైన విజయ్, మలావత్ పూర్ణ కాలేయ వ్యాధితో పోరాడుతున్న పిల్లల కోసం, 24 గంటల హెల్ప్ లైన్ సేవలను ప్రారంభించారు. విజయ్ హెల్ప్ లైన్ గురించి చెబుతూ పిల్లలకు బహుమతులు ఇచ్చారు.
ఈ సందర్భంగా విజయ్ ప్రసంగిస్తూ అతను బతుకున్నంత వరకు తన శరీరంలో ఉండే అవయవాలు చెడిపోకుండా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకొని, ఆ తర్వాత తను చనిపోయినప్పుడు అవయవాలను దానం ఇస్తానని చెప్పాడు. అవయవాలను దానం చేయడం వలన ఇంకొకరి జీవితం నిలుస్తుందని చెప్పాడు.
మన శరీరంలో ఉండే ఎంతో విలువైన అవయవాలన్నీ చనిపోయినప్పుడు, మనకు ఏ విధంగా అవసరం ఉండవు. అంతేకాకుండా మట్టిపాలు అవుతాయి. అందువల్లనే విలువైన అవయవాలను మట్టిపాలు చేయడం కన్నా, వేరే వారికి దానం ఇస్తే వారికి జీవితాన్ని ఇచ్చిన వారం అవుతాం. మనిషిగా జన్మించినందుకు తగ్గ ప్రతిఫలం పొందిన వారం అవుతామని, తమ అభిమానులకు కూడా చెప్పాడు.
హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన విషయాలను వీడియో ద్వారా హాస్పిటల్ వర్గాలు ట్విట్టర్లో బుధవారం రోజున పోస్ట్ చేశారు. దీంతో విజయ్ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారాయి.
ఈ మాటలు విన్న అభిమానులు విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ అన్న మంచి మనసున్న హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు విజయ్ దేవరకొండను నువ్వు దేవుడవు, అవయదానం చేసి మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వాడవు అవుతావని విజయం పొగుడుతున్నారు.