Toyota Innova Hycross: టయోటా సరికొత్త ఇన్నోవా హైక్రాస్-దీని ధర ఎంత అంటే?
Toyota Innova Hycross: వాహనాల్లో మరో కొత్త రకం వచ్చేసింది. ఫోర్ వీలర్కి సంబంధించి”ఇన్నోవా హైక్రాస్”అనే మరో సరికొత్త కారు మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఈ టైప్ కారును టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో రిలీజ్ చేసింది. రవాణా దీని ద్వారా మరింత సులభంగా నుంది. మరిన్ని కొత్త ఫీచర్స్ తో, మైలేజ్ తో ఈ రకం మార్కెట్లోకి వచ్చింది. కానీ ఇన్నోవా హైక్రాస్ కారు ధరలు మాత్రం 2023 వ సంవత్సరంలో విడుదలవుతాయి. ఈ కార్ కి సంబంధించిన విక్రయాలు (అమ్మకాలు) కూడా 2023 వ సంవత్సరంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
టయోటా కంపెనీ ద్వారా తయారు చేయబడిన ఇన్నోవా హైక్రాస్ అనే కారు ఇటీవల జెనిక్స్ పేరుతో ఇండోనేషియన్ మార్కెట్లో కూడా రిలీజ్ అయింది. ఎంపీ వి కొత్త ఫ్లాట్ ఫామ్ పై రూపొందించబడి ఉం ది. ఈ కారు ఆధునిక డిజైన్స్ , అధునాతన ఫీచర్స్ ద్వారా తయారు చేయబడింది. దీని పనితీరు కూడా చాలా బాగా ఉంటుంది.
నిజంగా చెప్పాలంటే ఇన్నోవా హైక్రాస్ పూర్తిగా కొత్త రకం అయిన కార్. మోనోకో క్ నిర్మాణం పై ఆధారపడిన మొదటి ఇన్నోవా. ఈ మోడల్ దాదాపు ఇంతకుముందు ఇండోనేషియా మార్కెట్స్ లో రిలీజ్ అయిన ఇన్నోవా జెనిక్స్ మాదిరిగానే ఉంటుంది.హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ వుండి దాని మధ్యలో బ్రాండ్ లోగో కలిగి ఉంటుంది. ఇది క్రోమ్ తో పూర్తయి ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
దీంట్లో ఉన్న ఫీచర్స్–
ఇంటిగ్రేటెడ్ డే టైం రన్నింగ్ లైట్ లతో కూడిన ఎల్ఈడి హెడ్ లాంప్స్, రీ డిజైన్ చేయబడిన అండ్ అండ్ రియర్ బంపర్లు,సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్ లైట్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ లాంటివి వెనుకవైపు ఉంటాయి. ఇంటీరియర్ డ్యూయల్ టోన్ తీం కూడా కలిగి ఉంది.10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వీటికి ఈ కార్ సపోర్ట్ చేస్తుంది.సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్ కూడా కలిగి ఉంది.
ఈ కార్ మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ లాంటి సరికొత్త ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది.పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్,MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ కూడా ఉంటాయి.స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. ఈ ఈ కారు9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతూ ఉంటుంది. ఈ కారు21.1కి.మి/మి మైలేజ్ ని కూడా అందిస్తుంది.