Site icon ట్రెండింగ్ వార్తలు

మెడలో తాళి తీసినందుకు భర్తకు విడాకులు మంజూరు

విడాకుల విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చినది.అది ఏమనగా భర్త బ్రతికి ఉండగా పెళ్లి అయిన మహిళ మంగళ సూత్రం/తాళిని తన మెడలో నుండి తొలగించినట్టయితే/తీసివేసినట్లయితే ఆ భర్త విడాకులు తీసుకొవడానికి అర్హుడు. అని జస్టిస్ వేలుమని,మరియు మద్రాస్ హైకోర్టు తీర్పును ఇచ్చింది.

వివరాలకు వెలితే తమిళనాడుకు చెందిన సి.శివకుమార్ 2016 వ సంవత్సరం జూలై,15 వ తేదీన మద్రాస్ హైకోర్టులో విడాకుల కొరకు పిటిషన్ వేశారు. అయితే వీరి విడాకులను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది.

భార్య తరపు న్యాయవాదుల వాదన ప్రకారం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహిత మహిళ మెడలో మంగళసూత్రం ధరించడం తప్పనిసరి కాదు అని,ఇది కేవలం మన సనాతన ఆచారమని వాదించింది.

అయితే భర్త తరపు న్యాయవాదుల వాదన ప్రకారం మన సనాతన ఆచారాల వ్యవహారాల దృష్ట్యా ఒక వివాహిత మహిళ తన భర్త చనిపోవక ముందు తన మెడలోని మంగళహారాన్ని తీసివేసిందంటే, మన ఆచారాల ప్రకారం భార్య మెడలో మంగళసూత్రం లేకుండా వుంటే ఆ మహిళకు భర్త లేకపోవడం, లేదా చనిపోయినట్టు అని నిదర్శనం అని తెలిపింది.

ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని జస్టిస్ వేలుమని, మరియు మద్రాస్ ధర్మాసనం ఈక్రింది విధంగా తీర్పును చెప్పింది.ఈ కేసులో సి. శివకుమార్ భార్య తన భర్త బ్రతికి ఉండగానే తన మెడలోని మంగళసూత్రాన్ని తీసివేయడం వల్ల, తన భర్త ను తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసిందని, మరియు తన భర్త పట్ల క్రూరమైన చర్యను కలిగి ఉందని,సమాజంలో తన భర్త కు తీవ్రమైన అవమానం కలిగే విధంగా ప్రవర్తించిందని, పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని సి.శివకుమార్ కు తన భార్య నుండి విడాకులు మంజూరు చేసింది.