లలిత్ మోడీ తో మాజీ విశ్వసుందరి డేటింగ్

1994 వ సంవత్సరపు విశ్వసుందరి,తెలుగు, తమిళ,హిందీ సినీ యాక్టర్ సుస్మితాసేన్ ప్రపంచ విశిష్ఠత గాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొట్టమొదటి చైర్మన్ లలిత్ మోడీ తో డేటింగ్ లో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం తమ యొక్క ఫోటోలను షేర్ చేసుకున్నారు.

సుస్మితాసేన్ ప్రస్తుత వయస్సు 46 సంవత్సరాలు.ఈమె హైదరాబాదులో పుట్టింది ఈమె మాతృభాష బెంగాలీ. సుస్మితాసేన్ మోడల్ గా, యాడ్ లలో నటించడం వలన ఫెమస్ అయినది.

తద్వారా 1994 వ సంవత్సరంలో ఫిలిప్పీన్ దేశంలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల లో ఇండియా తరఫున పాల్గొని ఇండియా నుంచి మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటం ను సొంతం చేసుకొంది. అలాగే సుమారు 70 తమిళ తెలుగు హిందీ సినిమాలో నటించింది.

ప్రస్తుతం హాట్ స్టార్ లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఈమె ఏ పని చేసినా ఒక సంచలనమే.సుస్మితాసేన్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలనా చూస్తూ ఉన్నారు. అలాగే  తనకన్నా వయసులో చిన్నవాడైన రోమన్ షాల్ తో సహజీవనం చేసింది. ఈ సహజీవనం డిసెంబర్ 3 2021 వరకు కొనసాగి కొద్దిపాటి మనస్పర్థల వల్ల ఇరువురు విడిపోయారు.

ఆ తర్వాత సుస్మితాసేన్ ఐపీఎల్ మొట్టమొదటి చైర్మన్ లలిత్ మోడీ తో ప్రేమాయణం నడిపి డేటింగ్ లో ఉన్నది. ప్రస్తుతం వీరు డేటింగ్ లో ఇంగ్లాండ్ దేశంలో సేద తీరుతున్నారు. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా వారి యొక్క చిత్రాలను షేర్ చేసుకోవడం ద్వారా ఒకరిపై ఒకరు తమ ప్రేమను బయటపెట్టుకున్నారు. ఏంటో ఈ లేటు వయసులో ప్రేమ యానం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker