Viral Video: చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని ఊరికే అంటారా, కావాలంటే మీరే చూడండి

పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అని అంటుంటారు కదా! కానీ ఈ వీడియో చూశాక పసిపిల్లలను చూసి మనం ఎంతో నేర్చుకోవాలని తెలుస్తోంది. రోడ్డుపై కష్టాల్లో ఉన్న మనిషిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటే నిండా పదేళ్లు కూడా లేని ఈ చిన్నారులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తమ చిట్టి చేతులతో ఆ మనిషి కష్టాన్ని తీర్చారు. సాయం చేయాలని మనసు ఉండాలి గాని వయసుతో పని ఏముంది.

చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని ఊరికే అంటారా, కావాలంటే మీరే చూడండి

అని ఆ చిన్న పిల్లలు నిరూపించారు.రోడ్డుపై పండ్లు అమ్ముకొనే మహిళకు ఇద్దరు చిన్నారులు సాయం చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ వెళుతుండగా మధ్యలో ఏటవాలుగా రోడ్డు ఉంది ఆ ఎత్తుగడ్డపైకి తన తోపుడు బండిని ఎక్కించేందుకు మహిళా ప్రయత్నించగా ఆమెకు సాధ్యం కాలేదు. అటుగా వెళుతున్న కొంతమంది ఆమెను చూసి పట్టించుకోలేదు.

సాయం చేసేందుకు కూడా ముందుకు రాలేదు.కొద్దిసేపటికి స్కూల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు చిన్నారులు అటుగా వస్తూ ఆ మహిళను చూశారు. మనం కూడా ఆలోచించకుండా ఆమె దగ్గరకు వెళ్లారు. ఒకవైపు పాప మరోవైపు బాలుడు తోపుడు బండిని పట్టుకొని ఎత్తుగడ్డను ఎక్కించారు. వారు చేసిన సహాయానికి ఆ మహిళ చాలా మురిసిపోయింది. ఆ మహిళ వారికి ఇద్దరికీ కృతజ్ఞతతో చెరో అరటిపండు ఇచ్చింది.

ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇందుకు సంబంధించిన ఆదిత్యనాథ్ ట్విట్టర్లో షేర్ చేస్తూ మీరు సాధించిన డిగ్రీలు మీ ప్రవర్తనలో కనిపించకపోతే అని చిత్తు కాగితాలు మాత్రమే అని ఆయన రాస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఐదు లక్షల పైగా వీక్షించారు. ఆ చిట్టి చేతుల సహాయానికి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో మానవత్వం దయా గుణం పొగడ్తలకి ముంచేత్తుతున్నారే తప్ప వయసులో చిన్నోలైన దయాగుణం తో ఎత్తుకు ఎదిగిన ఈ చిన్నారులను మనం అభినందిద్దామా.

చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని ఊరికే అంటారా, కావాలంటే మీరే చూడండి

మనం సహాయం చేసేటప్పుడు ఇతరులకు దయతో కానీ ప్రేమతో కానీ చేయాలి. రోడ్డుమీద పోతున్నవారికి ఏదైనా కష్టంలో ఉంటే వారికి తప్పక సహాయం చేయాలి. అలా చేస్తే మంచిదని భావిస్తున్నారు…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker