Viral News: ఫుడ్ ఆర్డర్ లో ఇలాంటివి కూడా పంపిస్తారా! ఏం పంపించారో మీరే చూడండి

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు. కానీ ఇంటికి పార్సల్ వచ్చింది. అసలు ఏం జరిగింది ?ఎవరు పంపించి ఉంటారు.? అని అనుకుంటూ ఆ ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి వెళ్లి పార్సల్ రిసీవ్ చేసుకున్నాడు. ఓపెన్ చేసి దాన్ని చూడగా అతడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగింది ఆ కథ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా!.

ఫుడ్ ఆర్డర్ లో ఇలాంటివి కూడా పంపిస్తారా! ఏం పంపించారో మీరే చూడండి

వివరాల్లోకెళ్తే అమెరికాలోని న్యూయార్క్ పోలీసులకు ఒక ఆ సాధారణమైన కాల్ వచ్చింది. స్థానికంగా ఉండే వ్యక్తి. తన ఇంటికి సరీసృపాల బాక్స్ వచ్చిందంటూ భయపడుతూ పేర్కొన్నాడు. కట్ చేస్తే పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూడగా బల్లులు లతో నిండిన ఓ బాక్స్ కనిపించింది. వాటిని చూసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి భయంతో గుండెను అరచేతిలో పెట్టుకున్నాడు.

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు పోర్ట్ చెస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫేస్ బుక్ పోస్ట్ చేసింది. అది కాస్త నెట్టింట కొద్ది క్షణాల్లో వైరల్ గా మారింది.సరీసృపాలు నిండిన పార్సల్ బాక్స్ అనుకోకుండా తప్పు అడ్రస్ కు డెలివరీ అయింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఆ ఇంటి యజమాని భయంతో వణికిపోయాడు. అని పిసిపిడి పోస్టులో పేర్కొంది. సరీసృపాలన్నింటినీ పోలీసులు పట్టుకుని.

జాగ్రత్తగా బాక్స్ లో బంధించారు. వాటిని స్థానిక యానిమల్ షెల్టర్‌ నిర్వాహకులకు స్వాధీనం చేసేందుకు ఆయా షెల్టర్ యజమానులతో సంప్రదింపులు చేసుకున్నారు. అలాగే ఎవరైనా కూడా సరీసృపాల బాక్స్ పార్సెల్ అందలేదని అనుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోర్ట్ చెస్టర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కాగా ఈ వ్యవహారం పై పోర్ట్ చెస్టర్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

అన్యదేశ పెంపుడు జంతువుల వ్యాపారం ద్వారా అమెరికాలోని అక్రమంగా రవాణా చేయబడ్డాయని,వీటిని ఎవరు ఆర్డర్ చేశారని. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో? అనే కోణాలలో జప్తు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే ఆర్డర్లు కొన్ని సందర్భాలలో తప్పుగా వస్తూ ఉంటాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker