గురుపూర్ణిమ ఎలా వచ్చిందో తెలుసా? దాని ప్రత్యేకతలు

ప్రాచీన భారతదేశంలో గురు శిష్యుల సంబంధం చాలా బలంగా ఉండేది. ప్రాచీన కాలంలో రాజులు తమ యొక్క పిల్లలకు విద్య నేర్పించడం కోసం గురుకుటిరాలకు,ఆరామాలకు పంపెవారు.అక్కడ గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనులు చేసుకుంటూ, చదువుకుంటూ తమ విద్యాభ్యాసం ను పూర్తి చేసుకునేవారు.

అలాంటి గురువుల విశిష్టత మన భారత దేశంలో ఉంది కాబట్టే గురు విశిష్టత కు రూపమైన గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అని సూక్తి నేటికీ కొనయాడుతుంది.అలాంటి గురువులకే ఆది గురువు అయినటువంటి మరియు వేదాలను నాలుగు భాగాలుగా చేసిన వ్యాస మహర్షి ఆషాడ మాసం శుద్ధ పౌర్ణమి నాడు పుట్టినరోజు కాబట్టి ఆ రోజును వ్యాస పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ అని అంటారు.

అనగా శిష్యులకు గురువు జ్ఞానమును ఆపాదించిన రోజు మరియు పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా సప్త ఋషులకు జ్ఞానబోధ చేసిన రోజు మరియు బుద్ధ భగవానుడు తన యొక్క శిష్యులకు జ్ఞానోదయం చేసిన రోజు ఈరోజు ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి రోజున వస్తుంది. కాబట్టి ఈరోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.

ఈరోజు దత్తాత్రేయుడు తన యొక్క శిష్యులకు జ్ఞానం ఆపాదించిన రోజు. ఇలాంటి విశిష్టత కలిగినందున అదేవిధంగా ఈ సంవత్సరం జూలై 13 తేదీన ఐదు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది, నిండు పౌర్ణమి ఏర్పడుతుంది అలాంటి విశిష్ట ఉంది.కాబట్టే ఈ రోజు సాయిబాబాను నిష్టతో పూజిస్తే సర్వ కష్టాలు తొలగిపోతాయని, తమ యొక్క కుమారులకు మంచి బుద్ధి వస్తుందని ప్రాచీన కాలం నుంచి ఒక నమ్మకం.

ఈ రోజు సాయిబాబా పూజలో శనగలతో హారం చేసి సాయిబాబా మెడలో వేస్తే వారి యొక్క పాపాలన్నీ మరియు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం.గురు పూర్ణిమ రోజున ఇంట్లో వారందరూ కూడా తమ పిల్లలతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్రం లేదా హైగ్రీవసోత్రంను పాటించడం వలన మంచి జరుగుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker