Viral Video: ముల్ల పంది కి సహాయం చేస్తున్న కాకి,వైరల్ అవుతున్న వీడియో

సాధారణంగా మనం ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సహాయం చేస్తాం. ఎవరైనా రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామందికి వారికి సహాయం చేస్తూ ఉంటారు. వృద్ధులు వికలాంగులు గుడ్డి వారు గర్భిణీ స్త్రీలు అలా ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా మనం సహాయం చేస్తాం.

ముల్ల పంది కి సహాయం చేస్తున్న కాకి

చిన్నపిల్లలు రోడ్డును దాటించడంలో సహకరిస్తూ ఉంటారు. వారిని క్షేమంగా రోడ్డు దాటించిన తర్వాత వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇలాంటి సందర్భాలను మనం ఎన్నో చూసే ఉంటాం. అయితే జంతువులలో కూడా కొన్నిసార్లు రోడ్ల మీదికి వస్తుంటాయి. కానీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండడంవల్ల అవి రోడ్డు దాటేందుకు చాలా అవస్థలు పడుతుంటాయి.

వాహనదారులు నిర్లక్ష్యం వల్ల ఒక్కొక్కసారి అవి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే మనిషికి మనిషి సహాయం చేసుకున్నట్లే జంతువులు కూడా సహాయం చేసుకుంటాయి. ఇక్కడ ఒక మూగ జీవి మరొక మూగ జీవికి సహాయం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వీడియోని చూసి నేటిజెన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఒక చిన్ని పంది పిల్ల రోడ్డు మీదకి వచ్చింది. వాహనాలు రద్దీ ఉండడంతో రోడ్డు భయపడుతూనే రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంది.

ఇంతలో ముళ్ళ పంది అవస్థలు పడుతున్న గమనించిన కాకి దానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ముళ్ల పందిని వెనకాల పొడుస్తూ ముందుకు పద అంటూ తరుముతోంది. అయితే సాయం చేద్దామని వచ్చిన కాకికి ఆ ముళ్ళ పంది చుక్కలు చూపించింది. ఒక్క అడుగు వేసి వెంటనే భయంతో ముడుచుకుంటుంది.

దీని చర్యతో కాకి తల ప్రాణాలకు తోక మీదికి వచ్చినట్లు అయింది. ముళ్ళ పంది రోడ్డును దాటించేందుకు కాకి పడిన తాపత్రయం కూడా ఒక కారులో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్త వైరల్ గా మారింది. కాకి అవస్థలు ముళ్ళ పంది భయం చూసిన నేటిజన్ల నవ్వుకుంటున్నారు.

మరోవైపు కాకి సహాయంకి సాలాం అని కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు లుక్కేసేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker