Viral video: దోశలు చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త,దోశ ను తయారు చేసే పరికరం

టెక్నాలజీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతునే వస్తుంది.మనిషి చేసే అన్ని పనులను దాదాపు ఇప్పుడు యంత్రాలు చేసే విధంగా అభివృద్ధి చెందింది. వంట చేసే దగ్గర నుంచి ప్రతి చిన్నపనిని చేయడానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

దోశలు చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త,దోశ ను తయారు చేసే పరికరం

మనుషులకు పని తగ్గించి యంత్రాలు ఆ పనులను చేసి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి దోశ ప్రింటర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చిన్న సైజ్ జిరాక్స్ ప్రింటర్ లా ఉన్న ఈ పరికరానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఆవుతుంది.

చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ సంస్థ రూపొందించిన ఈ దోశ ప్రింటర్ అచ్చంగా చిన్న సైజులో ఉన్న ప్రింటర్ లా ఉంది. ప్రింటర్ లో ఎలాగైతే ఇంక్ ను పోస్తమో, అలాగే దీనిలో కూడా ముందుగా దోశ పిండిని పోయాలి. తర్వాత మిషన్ ఆన్ చేసి టైమర్ ను సెట్ చేసుకోవాలి.

కాసేపటికి మిషన్ మరో ద్వారం నుంచి వేడి దోశ బయటకు రావడం జరుగుతుంది. ఈవోచెఫ్ అనే పేరుతో రూపొందించిన ఈ యంత్రాన్ని ప్రపంచంలోనే తొలి స్మార్ట్ దోశ మేకర్ గా పిలుస్తారు. ఈ దోశ ప్రింటర్ కు సంబంధించిన వీడియో చూసిన అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దోశలు చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త,దోశ ను తయారు చేసే పరికరం

అయితే ఈ యంత్రం ధర ఎంత అన్న విషయాన్ని మాత్రం తెలపలేదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker