Site icon ట్రెండింగ్ వార్తలు

Viral News: నోట్లో పట్టని దాన్ని మింగిపోయిన పాము తీరా చూస్తే సీన్ రివర్స్

కళింగ పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. పాములో కింగ్ అనే పేరు దీనికే ఉంది. ఈ జాతి పాములు ప్రాంతాలకు సమీపంలో సంచరిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. చాలా పొడవుగా ఉంటాయి.

నోట్లో పట్టని దాన్ని మింగిపోయిన పాము తీరా చూస్తే సీన్ రివర్స్

కర్ణాటకలో ఇవి తరచుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా బాగా ఆకలితో ఉన్న ఓ భారీ కళింగ పాము ఓ ఉడుమును వేటాడింది. మాటు వేసి దాన్ని పట్టేసింది. అయితే దాన్ని మింగేందుకు అది అపసోపాలు పడింది.

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. సిర్సి సమీపంలో యానా క్రాస్ రోడ్ సమీపంలోని ఓ మరుగు ప్రాంతంలో ఈ విషయం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఉడుపును నోటపట్టిన సర్పం దాన్ని మింగేందుకు దాదాపుగా కొన్ని గంటల పాటు విశ్వ ప్రయత్నాలన్నీ చేసింది.

అయితే ఉడుము సైజు చాలా పెద్దదిగా ఉంది కాబట్టి. అలీమీ కాక చివరికి దాన్ని వదిలేసింది. అయితే అప్పటికే ఊపిరాడక ఉడుము చనిపోయింది. ఈ షాకింగ్ దృశ్యాలను అటుగా వెళ్లే బైక్ రైడర్ ఫోన్లో షూట్ చేయడం జరిగింది.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది..