కేరళను వణికిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లా కన్నూరు లోని నేన్ మేనిగ్రామంలో పందుల ద్వారా వ్యాపించే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు నమోదు అయినట్టు జిల్లా పశుసంవర్ధక శాఖ తెలియజేసింది. స్వైన్ ఫ్లూ వ్యాధిని వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేసింది. నేను మేని గ్రామంలో నేన్ మేని గ్రామంలో దాదాపుగా 200 పందులకు ఈ వ్యాధి వచ్చినట్టు నిర్ధారించారు.
వయనాడు జిల్లాలో పందుల పెంపకం ఎక్కువగా ఉంది. జిల్లా అంతట 222 పందుల ఫామ్ లుఉన్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ తెలిపారు.ఈ 222 పందుల ఫామ్ లో సుమారు 20వేల పందులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 200 పందులకు ఈ వ్యాధి సోగింది,మిగతా వాటికి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ఆఫ్రికన్స్ స్వైన్ ఫీవర్ ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా, బీహార్ రాష్ట్రంలో కూడా విస్తరించినట్టు ఆరోగ్య అధికారులు తెలియజేశారు. కాగా తూర్పు ఆఫ్రికాలో మొట్టమొదటి ఆఫ్రికన్ ఫీవర్ కేసు నమోదు అయింది ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి పెంపుడు పందుల ద్వారా యజమానులకు సోకుతుందని కావున యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలని పశు సంవర్ధక శాఖ ఒక నోటీసులో తెలియజేసింది. వీలైనంతవరకు పంది మాంసాన్ని తినకూడదని తెలియజేసింది.