Site icon ట్రెండింగ్ వార్తలు

లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో

ప్రకాశం జిల్లా: ఒంగోలు మండలం ముక్తినూతలపాడు చెందిన వీఆర్వో పి రమాదేవి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది.

ఒక రైతు కు చెందిన 26 సెంట్లు పొలం మ్యుటేషన్ మరియు పాస్ బుక్ జారీ చేయడం కోసం లంచం డిమాండ్ చేశారు. తొలుత 12 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆఖరికి 10 వేల రూపాయలకు వీఆర్వో బేరం కుదుర్చుకుంది. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులు దగ్గరికి వెళ్లి ఆశ్రయించారు.

బుధవారం ఒంగోలు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గరికి వచ్చి రైతు, వీఆర్వో రమాదేవికి ఫోన్ చేయగా, ఆఫీసులో ఉన్నాను అని సమాచారం ఇచ్చింది. బాధితులు వెళ్లి ఎమ్మార్వో ఆఫీస్ లో వీఆర్వో రూమ్ ఉన్న రమాదేవికి పదివేల రూపాయలు ఇవ్వగా తీసి పెట్టుకుంది. 

ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వీఆర్వో రమాదేవిని గారిని పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ ఎం.సూర్యనారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీమతి అపర్ణ, వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది పాల్గొన్నారు.