Article 370 abrogation, లాల్ చౌక్ లో విజయ్ దివస్
ఆర్టికల్ 370 రద్దు:జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విజయ్ దివస్ ను ప్రజలు చాలా గొప్పగా, ఘనంగా నిర్వహించుకున్నారు.జమ్ములోని ప్రసిద్ధ లాల్చౌక్ కట్టడం వద్ద వందల సంఖ్యలో ప్రజలు చేతిలో భారత జెండా పట్టుకొని ర్యాలీ చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ నగరవీధులలో తిరిగాడారు.వారు అంత గొప్పగా ఈ విజయ్ దివస్ ను జరుపుకోవడం వెనుక ఎంతో ప్రత్యేకత ఉంది.
అది ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. అనగా దేశంలోని రాష్ట్రాలకు భిన్నంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రభుత్వం, ప్రభుత్వ పాలన జరిగేది.అక్కడి పౌరులకు ద్వందపరసత్వం ఉండేది.ఈ కారణం చే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక తీవ్రవాదం,ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మారి ఎన్నో మారణ కాండలకి కేంద్ర బిందువుగా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 5 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసింది.జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా అక్కడి ప్రజలకి రాష్ట్రపరసత్వం, ఆ రాష్ట్రంలో అందరూ నివసించవచ్చు, స్థలాలు కొనవచ్చు అన్ని కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల మాదిరిగా,సాధారణ పరిపాలన దిశగా మారిపోయింది. అందుకే ఆగస్టు 5న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు ఈ ఆర్టికల్ 370 రద్దు వారి జీవితాల్లో ఎన్నో ఆశలు, ఆశయాలను తీసుకొచ్చింది.దీనికి గుర్తుగానే జమ్మూలోని లాల్చౌక్ వద్ద నేడు ప్రజలందరూ ఆనందంతో ర్యాలీ నిర్వహించారు