Site icon ట్రెండింగ్ వార్తలు

Viral Video: ఫోటోలు దిగడానికి వెళ్లి ప్రాణం తీసుకున్న యువకుడు

సెల్ఫీ పిచ్చిలో పడి చాలామంది ఇప్పటికే ప్రాణాలను కోల్పోవడం జరిగింది. పర్యాటకులు సెల్ఫీలు,ఫోటోలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలని అధికారులు హెచ్చరించినా కూడా కొందరు దాన్ని పట్టించుకోవడం లేదు. ఎంతో సంతోషంతో స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను చూడడానికి వచ్చి సెల్ఫీ పిచ్చిలో పడి వింతజీవులుగా మారిపోతారు.

ఫోటోలు దిగడానికి వెళ్లి ప్రాణం తీసుకున్న యువకుడు

స్నేహితులతో కలిసి సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్ళగా, అందులో ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన కూడా ఉంది. ఆ ఘటనను మరువక ముందే మరో యువకుడు సెల్ఫీకి బలయ్యాడు. జలపాతం పక్కనే అందంగా ఉండగా దానితో ఫోటో దిగాలని అనుకునీ కాలుజారి అందులో పడి గల్లంతయ్యాడు. తమిళనాడులోని కొడైకెనాల్ చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఘటన ఆగస్టు 3న జరగ్గా ఈ వార్త అందరికీ ఆలస్యంగా తెలిసింది. 28 ఏళ్ల అజయ్ ఇండియన్ స్నేహితుడిగా కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్ళడం జరిగింది. జలపాతం దగ్గర నిలబడి ఫోటోలు దిగలనుకున్నాడు కానీ అక్కడే ఉన్న రాళ్లపై నిలబడి ఫోటోలు దిగుతుండగ,అతని స్నేహితుడు వాటికి ఫొటోలు తీస్తున్నాడు.

అయితే తన స్నేహితుడు జాగ్రత్త అని అరుస్తున్నప్పటికీ కూడా అజయ్ వినిపించుకోకుండా మరింత కిందకి దిగి ఫోటోలకు మంచి ఫోజులను ఇచ్చే క్రమంలో అతను కాలుజారి జలపాతంలో పడిపోవడం జరిగింది. ఈ సంఘటన మొత్తం ఫోన్లో రికార్డు అయ్యింది. ఆ విషయాన్ని తెలుసుకున్న రిస్క్ సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి గాలింపు చర్యలు తీసుకున్నారు.

ఫోటోలు దిగడానికి వెళ్లి ప్రాణం తీసుకున్న యువకుడు

గల్లంతైన యువకుడు రాజకీయం ఇంకా లభించలేదని తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నేట్టింట వైరల్ అవుతోంది. దాంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసుకుని విచారణలు చేపట్టారు.