తెలంగాణలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
తల్లిపాల వారోత్సవాలు:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తల్లిపాల విశిష్టతను తెలిపేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాలే ముద్దు-డబ్బా పాలు వద్దు అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే తెలంగాణ అంతట తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు హైదరాబాదులోని పెట్ల బురుజు ప్రభుత్వ దవాఖానాలో ఈ కార్యక్రమంలో భాగంగా మిల్క్ బ్యాంకు ను ప్రారంభించారు.
తల్లి గర్భం నుంచి ప్రసవించగానే శిశువుకి మొట్టమొదటి ఆహారంగా గంట వ్యవధి లోనే తల్లి యొక్క ముర్రు పాలను పట్టించినట్టయితే ఆ శిశువుకు వ్యాధి నిరోధకత తో పాటు మొదటి డోసు టీకా వేసినట్లు సమానం. సామాన్యంగా స్త్రీలు తమ శిశువు లకు తల్లిపాలను పట్టిస్తారు. కానీ నేటి ఆధునిక పోకడల దృష్టిలో ఉంచుకొని చాలామంది తల్లులు తమ పిల్లలకి తమ యొక్క చనుపాలు ఇవ్వడం లేదు.అందుకే ప్రపంచం మొత్తం మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తల్లులలో అవగాహన తెచ్చేందుకు ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు తల్లిపాల శ్రేష్టత గురించి అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో 88% తల్లులు ఆరు నెలల పాటు తమ పిల్లలకు పాలు ఇచ్చే దేశం బంగ్లాదేశ్ గా పేర్కొంది. అందుకే బంగ్లాదేశ్ ను గ్రీన్ నేషన్ గా గుర్తించింది. మనదేశంలో అయితే కేవలం 36 శాతం మంది మాత్రమే మొదటి గంటలో శిశువుకు తమ చనుపాలను తాపుతున్నారు. అనగా 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలు తాగడం లేదు. అలాంటి వారిలో అవగాహన కోసమే ఈ తల్లిపాల వారోత్సవాలను చేపట్టడం జరిగింది. సామాన్యంగా పిల్లలకి పుట్టిన గంటలోనే తల్లిపాలు పట్టించినట్టయితే వారిలో రోగాలను ఎదుర్కొనే శక్తి రెట్టింపు అవుతుంది. అందువలనే నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించవచ్చును.
ఈ సమావేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని,గాంధీ, నిమ్స్ హాస్పిటల్ లో బలోపేతం చేస్తున్నామని, ఈ రెండు హాస్పిటల్ లలో 250 పడగల ఎం సి హెచ్ ఆసుపత్రులను ఇస్తున్నామని క్లిష్టమైన,సీరియస్ కేసులు కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే నయం అయ్యే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు ఉందని తెలియజేశారు.అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ నుంచి,పేషెంట్లు బంధువుల నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల సంఖ్య పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేసి వైద్యులను అభినందించారు.