Site icon ట్రెండింగ్ వార్తలు

అమరావతిలో ప్రబలిన కలరా ఆందోళనలో ప్రభుత్వం

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గడిచిన వారం రోజుల నుంచి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మూడు రోజుల క్రితం అమరావతి జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలు బావుల నుంచి మంచి నీటిని తీసుకెళ్లి తాగడం వల్ల సుమారు 50 మంది అనారోగ్యానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా జిల్లా అంతటా కలరా వ్యాధి ప్రబలి గడిచిన వారం రోజులలో సుమారు 190 కలరా కేసులు నమోదయ్యాయి.వారిలో ఐదు మంది చనిపోయారు.

ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై గ్రామాల్లో, మరియు పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమం ను వేగవంతం చేసింది. అందులో భాగంగా గ్రామాలలో బ్లీచింగ్ చల్లడం, రోగగ్రస్తులకు ఓ. ఆర్. ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం, మరియు గ్రామాలలో మంచినీటిని సరఫరా చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నవి.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర లోని మేలు ఘాట్ లో కూడా నీరు కలుషితం కావడం వలన డయేరియా వ్యాధి ప్రబలి సుమారు 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన తెలియగానే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జిల్లా యంత్రాంగాన్ని మరియు కలెక్టర్ ని అప్రమత్తం చేసి వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా కలరా వ్యాధి ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది గా ప్రజారోగ్యశాఖ ను ఆదేశించడం అయినది.