Viral News: పాముల స్మగ్లింగ్ ఎలా చేస్తున్నాడో తెలిస్తే మీరే షాక్ అవుతారు

విషపూరిత జంతువులను చూస్తే మనకు చాలా భయం వేస్తుంది. వణికిపోతాం అసలు ఆ చుట్టుపక్కన కూడా కనిపించాం. అయితే ఒక వ్యక్తి వాటిని తన దుస్తులలో దాచిపెట్టి దేశాలను దాటిస్తూ ఉంటాడు. అయితే అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఒక్క వ్యక్తి తన ప్యాంట్లు 60 రకాల పాములు. బల్లులు ఇతర సరిసృపాలను స్మగ్లింగ్ చేస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.

పాముల స్మగ్లింగ్ ఎలా చేస్తున్నాడో తెలిస్తే మీరే షాక్ అవుతారు

ఈ షాకింగ్ సంఘటన అమెరికాలోని మెక్సికో సరిహద్దులలో చోటుచేసుకుంది. స్మగ్లింగ్ ను పసిగట్టిన అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాలు స్మగ్లింగ్ చేసేవాళ్లు ఇలా కూడా చేస్తారని ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. పెద్ద పెద్ద స్మగ్లర్లు ఎవరికి తెలియకుండా ఇలాంటి రహస్యాలను ఉపయోగిస్తూ ఉంటారు.

7,50,000 డాలర్లు విలువైన సరిసృపాల స్మగ్లింగ్ చేస్తూ ఉండడంతో,చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిలో భాగంగా వాటినన్నిటిని ప్యాంటులో పెట్టుకొని అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడిదుస్తులు మొత్తం విప్పి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా 60 రకాల పాములు ఉన్నట్లు తెలియజేశారు. బల్లులు వంటివి కూడా దొరికినట్లు తెలియజేశారు.

దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోష్ మాన్యుయేల్ పెరేజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1700 జంతువులను మెక్సికో హాంకాంగ్ ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడి అక్రమ రవాణ ఈ ఏడాది మార్చిలో బయటపడింది. నిందితుడు జోష్ గతంలో గాడిదలను కూడా సరిహద్దులు దాటిస్తున్నట్లు ఒప్పుకున్నాడు అని అధికారులు తెలియజేశారు.

అందులో యుకాటాన్‌ బాక్స్‌ తాబేళ్లు, మెక్సికన్‌ బాక్స్‌ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్‌ పూసల బల్లులు సహా ఇతర అరుదైన జంతువులు ఉన్నాయన్నారు. ఈ రెండు కేసులలో స్థానిక కోర్టు అతడి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker