Lawrence: లారెన్స్ తో పీకల్లోతు ప్రేమలో ఇల్లి బేబీ

సన్నని నడుముతో యువకుల మనసులు దోచిన గోవా బ్యూటీ ఇలియానా మరోసారి ప్రేమలో పడింది. ప్రేమికుడు మరెవరో కాదు బాలీవుడ్ అందాల బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు స్టేబా స్టీయన్ లారెన్స్ అని గుసగుసలాడుతున్న బాలీవుడ్.

చిట్టి నడుముఇలియానా తెలుగులో దేవదాస్ మూవీ లో రామ్ సరసన వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో నటించింది. 2006 లో పూరి డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇలా తెలుగులో 14 సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు, శాండిల్ వుడ్ లో ఒక సినిమా, బాలీవుడ్ లో ఎనిమిది సినిమాల్లో నటించింది.

బాలీవుడ్ సినిమా అయినా బర్ఫీతో 2012లో ఉత్తమ నూతన నటి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకుంది. తెలుగులో దేవదాస్ చిత్రానికి కూడా ఉత్తమ నూతన నటి అవార్డు గెలుచుకుంది.

సినిమాలలో బాగా రాణిస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ లిబోన్ తో ప్రేమలో పడి గోవాలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని సినీవర్గాల వార్త. కానీ 2019లో ఈ జంట కొన్ని కారణాలతో విడిపోయారు. ఆ ప్రభావంతో ఇలియానా ఒత్తిడికి గురై అందంపై దృష్టి పెట్టక లావైపోయింది. అయితే గడిచిన రెండు సంవత్సరాల నుంచి సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టి బరువు తగ్గి, అందంగా తయారై సినిమాలో నటించడం మొదలు పెట్టింది. ఇల్లి బేబీ ఈసారైనా ప్రేమలో రాణిస్తుందేమో చూద్దాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker