మీరు ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ మొదలగు సామాజిక మాధ్యమాలలో వచ్చే వెబ్ సైట్ ల నందు డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారా


కర్నూలు, ఆగష్టు 28. మీరు ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ మొదలగు సామాజిక మాధ్యమాలలో వచ్చే వెబ్ సైట్ ల నందు డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారా ! మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త !

సైబర్ నేరగాళ్లు ఇటీవలే కాలం లో తమ పేరిట ఒక వెబ్ సైట్ ని రిజిస్టర్ చేయించుకొని ఆ వెబ్ సైట్ కు సంబంధించిన లింకును సామాజిక మాధ్యమాల యందు ఉంచి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు తమకు సంబంధించిన ఒక వెబ్ సైట్ లింకు ను సామాజిక మాధ్యమాలలో ఉంచుతూ ఈ వెబ్ సైట్ నందు డబ్బును ఇన్వెస్ట్ చేసిన చో మీకు తక్కువ వ్యవధి లో నే ఎక్కువ లాభాలు వస్తాయి అన్నట్టుగా కొన్ని ఇన్వెస్ట్ స్కీమ్స్ కు సంబంధించిన వీడియో లను ఉంచుతూ , మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ నెంబర్ ను సంప్రదించగలరు అంటూ ఒక నెంబర్ ను ఉంచుతారు.

ఎవరైనా ఈ వెబ్ సైట్ ను , లింకు ను చూసి ఆ నెంబర్ ను సంప్రదించినట్లయితే వారు వివిధ స్కీమ్ ల వివరాలు తెలుపుతారు . వాటిని నమ్మి మీరు ఆ వెబ్ సైట్ నందు మొదటగా కొంత డబ్బును ఇన్వెస్ట్ చేసిన యెడల మీకు వాటికి సంబంధించిన రిటర్న్స్ మీకు ఇస్తారు .

దీనిని నమ్మి మీరు అధిక మొత్తాలలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు, ఇలా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు కు ఎన్ని రోజులకు మీకు తిరిగి రాక పోయే సరికి మీరు ఆ వెబ్ సైట్ కు సంబంధించిన నంబర్ ను సంప్రదించటానికి ప్రయత్నించగా ఆ నంబర్ మనుగడ లో లేదు అని కానీ స్విచ్ ఆఫ్ అని కానీ వస్తుంది.

ఆ వెబ్ సైట్ కు సంబంధించిన లింకు కోసం మీరు సామాజిక మాధ్యమాలలో ఎక్కడ వెతికినా కనపడదు , దీని తర్వాత మీరు మోస పోయాం అన్న విషయం మీకు అర్థం అవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు….

  1. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఇటువంటి ఇన్వెస్ట్ స్కీమ్స్ కు సంబంధించిన వీడియో లను నమ్మకండి.
  2. మీకు తెలియని, పరిచయం లేని వ్యక్తుల ద్వారా వచ్చే డబ్బు పెట్టుబడి కి సంబంధించిన స్కీమ్స్ నందు డబ్బులు పెట్టకండి.
  3. మీకు తెలియని లింకు లను క్లిక్ చేయకండి .
  4. మీలో ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ నందు కానీ సైబర్ మిత్ర వారికి కానీ ఫిర్యాదు చేయండి.

ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయoడి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker