Mahesh Babu: గుంటూరు బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబు మూవీ

టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిల్క్ బాయ్ గా అంటూ ఉంటారు మహేష్ బాబుని. మహేష్ బాబు తనదైన శైలిలో నటిస్తూ రకరకాల మూవీస్ లో డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు.

ఈసారి మరో కొత్త మూవీతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు.డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు నువ్వు జనవరి 18వ తేదీన ప్రారంభమయ్యాయి.

చాలా కాలం విరామం తర్వాత సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. మరి ఈ మూవీలో మహేష్ పక్కన చేసే హీరోయిన్స్ విషయానికి వస్తే పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమాలో ఉన్న ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళీ నటి శోభన ని ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.

గుంటూరు బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబు మూవీ
గుంటూరు బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబు మూవీ

ఇదంతా పక్కన పెడితే మొత్తానికి ఈ మూవీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి తీయబోతున్నారు అంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ మూవీలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి తీయబోతున్నట్లు తెలిసింది. మరి ఈ మూవీకి నిర్మాతగా నాగవంశీ చేస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు అయితే ప్రారంభమయ్యాయి.

నిర్మాత నాగ వంశీ ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే చేసేసారు. ఈ మూవీ ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటికి రావడం జరిగింది. త్రివిక్రమ్ ఈ మూవీని గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ కథను తీయబోతున్నట్లు సమాచారం.

గుంటూరు నేపథ్యం అంటేనే పల్నాడు రాజకీయాలు, రాజకీయ గొడవలు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. ఇలాంటివన్నీ ఈ మూవీలో ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ ఉన్నత కుటుంబాలలో జరిగిన కథలు గానీ మూవీస్ ని తీసేవారు. హీరోని బిజినెస్ టైకోన్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు సరికొత్తగా మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో అదేవిధంగా మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ కొద్దిగా రాజకీయాలను, ఫ్యాక్షన్ గొడవలు కలిపి గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తీయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ కోసం గుంటూరులో కొన్ని షెడ్యూల్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలింనగర్లో వినిపిస్తుంది.

మరి ఈ మూవీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి గుంటూరులో షూటింగ్స్ ఎప్పుడు చేస్తారు అనే విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు. విలేజ్ కి సంబంధించిన నేటివిటీ కూడా ఈ మూవీలో మిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker