Site icon ట్రెండింగ్ వార్తలు

Parsi new year

Parsi new year:పార్సీ మతం ఇరాన్ లో పుట్టి మధ్య ప్రాచ్య దేశాల్లో కూడా వ్యాప్తి చెందింది.ఇండియాలో గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో పార్సీ లు ఎక్కువ శాతం లో నివసిస్తున్నారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన వసంత విషవత్తు నాడు వస్తుంది. అయితే భారతదేశంలో పార్సీ జాతి వారు షేహన్షా హి క్యాలెండర్ ను అనుసరిస్తారు కావున భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 16 వ తేదీన పార్సీ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.

Parsi new year

చరిత్ర ప్రకారం చూస్తే ఈ రోజును నవ్రొజ్ అని కూడా పిలుస్తారు నవ్ అనగా కొత్త, రోజ్  అనగా దినము. ఈ నవ్రోజ్ లేదా పార్సీ దినమునకు సస్తానియస్ రాజు జంషెడ్ నామకరణం చేశాడు. జంషెడ్ రాజు పర్షియన్ క్యాలెండర్ లేదా  షేహేన్షాహి క్యాలెండర్ స్థాపించాడని నమ్మకం. పురాణ గాథ ప్రకారం జంషెడ్ రాజు ప్రపంచాన్ని కాపాడే ఉద్దేశంతో రాక్షసులతో పోరాడినప్పుడు అతను ఎర్రటి సూర్యుడి లా ప్రకాశంవంతంగా ప్రకాశించాడని అందుకే పర్షియా అంతటా ఆరోజును పార్సీ నూతన దినోత్సవం గా జరుపుకుంటారని ప్రతితీ.ఏడవ శతాబ్దం వరకు పార్సి మతము ప్రాచర్యంలో ఉన్నది ఇస్లాం మతం ఏర్పడిన తర్వాత నుండి దీని యొక్క ప్రాముఖ్యత తగ్గడం ప్రారంభమైనది.

క్యాలెండర్ లో  పార్సీ మత ప్రస్తావన,పార్సీ నూతన సంవత్సర గురించి ఉన్నది.యునెస్కో 2016లో నౌరూజ్ ను మానవత్వం యొక్క ఆసంకల్పిత సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. పార్సీ నూతన సంవత్సర వేడుకలతో ముడిపడి ఉన్న మతమైన జొరాస్టియన్ మతాన్ని జరతుస్ర అనే ప్రవక్త  క్రీస్తుపూర్వం 650 సంవత్సరంలో స్థాపించారు.

పార్సీ నూతన సంవత్సరం రోజున పార్సీలు ఇంటిని శుభ్రం చేయడం,కొత్త బట్టలు ధరించడం,రుచికరమైన సాంప్రదాయబద్ధకమైన అత్యంత విలాసవంతమైన ఆహారాన్ని వండడం.ఆహార వంటకాలలో షా లేక స శబ్ద ఉచ్చారణతో మొదలయ్యే ఏడు వంటకాలను వండడం వారి సంప్రదాయం.ఈ రోజున దేశంలో ఉన్న పార్సి లు అందరూ ఒక గుంపుగా చేరి సమూహంగా మారి వారి దేవాలయం అయినటువంటి అగ్ని దేవాలయాన్ని సందర్శిస్తారు మరియు వారి ఇంటిలో నీటి గిన్నెలో నిప్పును ఉంచడం ఒక సంప్రదాయం. ఇలా ఆనందంతో భక్తిశ్రద్ధలతో పార్సీ లు నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.