Site icon ట్రెండింగ్ వార్తలు

రాజమౌళి జగపతిబాబు వియ్యంకులా?

భారతదేశంలో స్టార్ డైరెక్టర్లు ఎవరని సెర్చ్ చేస్తే ముందు వరుసలో ఉండే వారే ఎస్.ఎస్. రాజమౌళి. ఇతను డైరెక్టర్ చేసిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ ఇతని యొక్క పేరు దేశ,విదేశీలలో ఖ్యాతి గాంచింది. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ.ప్రభాస్ తో చత్రపతి, బాహుబలి1,2 లు.రామ్ చరణ్ తో మగధీర సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికతో మల్టీస్టారర్ లో RRR సినిమా డైరెక్షన్ చేశాడు.

ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.అలాంటి రికార్డు క్రియేట్ చేసే సినిమాలు చేసిన డైరెక్టర్ తన జీవితంలో కూడా సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకున్నాడు.తన ధర్మపత్ని,సహచరిని ఆయన రమ ను ప్రేమించి 2001లో పెళ్లి చేసుకున్నాడు. రమా కి అప్పటికే పెళ్లయి ఒక కుమారుడు కార్తికేయ కూడా ఉన్నాడు.

అలాంటి ఆవిడను పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాడు అంతేగాక తమ ఇద్దరికీ పిల్లలు వద్దని ఒక అమ్మాయిని దత్తత తీసుకొని సొంత కూతురుగా పెంచుకుంటున్నారు ఆ అమ్మాయి పేరు మాముఖ. అమ్మాయి ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తూ ఉంది. రమా ఎవరో కాదు రాజమౌళి పెద్దనాన్న కుమారుడైన ఎం.ఎం. కీరవాణి భార్య అయినా శ్రీవల్లి సొంత సోదరి.

మరి రమా కి తన మొదటి భర్త వల్ల కలిగిన కార్తికేయకు టాలీవుడ్ స్టార్ జగపతిబాబు అన్న కూతురుతో వివాహం జరిగింది. అలా రాజమౌళి జగపతిబాబు వియ్యంకులు అయ్యారు.ప్రస్తుతం కార్తికేయ రాజమౌళి సినిమాల క్రియేటివ్ హెడ్ గా ఉన్నాడు. రమా మాత్రం రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలకి డిజైనర్ గా పనిచేస్తున్నారు.