Site icon ట్రెండింగ్ వార్తలు

ఈ సంవత్సరం వచ్చిన రాఖీ పండగ విశిష్టత తెలుసా?

ఈ సంవత్సరం వచ్చిన రాఖీ పండగ విశిష్టత తెలుసా?

మనదేశంలో అనేక కులాల వారు మతాలవారు ఉన్నారు. మనమందరం కలిసి మన దేశ సంప్రదాయాలను, సంస్కృతిని పాటిస్తూ ఎన్నో రకాల పండుగలు జరుపుకుంటాము. అలాంటి వాటిలో రాఖీ పండుగ ఒకటి. ఈ రాఖీ పండుగను రక్షాబంధన్ అని అంటారు. ఇది సంస్కృతి నుండి వచ్చిన పదం రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం అని అర్థం.

ఈ పండుగను చిన్నా, పెద్ద తేడా లేకుండా కులమత ,బేధం లేకుండా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. అందువల్ల దీనిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండగ పేరుప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో సాలునో అని మరికొన్ని ప్రదేశాలలో సీలోను అని మరికొన్ని చోట్ల రాక్రీ అని పిలుస్తూ ఉంటారు. ఎలాంటి పేర్లతో పిలిచినా ఈ పండగ అన్నా,చెల్లెల అనుబంధానికి ప్రతికగా జరుపుకుంటారు.

ఈ పండగ నార్త్ ఇండియాలో మొదలైనది అయినప్పటికీ మనందరం కలిసి జరుపుకుంటున్నాం. రాఖీ పండగ రోజున అన్నా లేదా తమ్ముడికి అక్క లేదా చెల్లెలి ప్రేమగా వారికి రక్షణగా ఎటువంటి అవరోధాలు కలగకుండా వారి చేతి మణికట్టుకు ఒక దారాన్ని కడుతుంది. దీనినే రాఖి అంటారు. ఈ పండుగ రోజున అన్నదమ్ములకు అక్క ,చెల్లెలు కుంకుమ పసుపు కలిపిన అక్షంతలతో బొట్టు పెట్టి వారికి హారతి ఇచ్చి, చేతికి రాఖి కట్టుకొని ఈ పండగను జరుపుకుంటారు. కొందరు ఈ పండగ రోజున పూజలు, వ్రతాలు కూడా చేసుకుంటారు.

అదేవిధంగా బ్రాహ్మణులు కొత్తగా జంజం లేదా ఉపనయనం వేసుకుంటారు. అలాగే పాతబడి తెగిపోయేలా ఉంది అనుకునేవారు ఈ రోజున మార్చుకుంటారు.

ఈ సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి రోజున వచ్చిన ఈ రాఖీ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రాఖీ పండగ ఈ సంవత్సరంలో రెండు రోజులు (11,12 తేదీలలో)వచ్చింది. ఈ పండుగ శ్రావణమాసంలో వచ్చిన పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రం కూడా ఉంటుంది. ఈ పౌర్ణమి 11 గురువారం రోజు వచ్చింది. పౌర్ణమి రాత్రి 10: 30 నిమిషాల నుండి మరుసటి రోజు శుక్రవారం వరకు ఉంటుంది. అందువల్ల ఈ పండగను గురువారం, శుక్రవారం కూడా జరుపుకుంటారు.

ఈ సంవత్సరం రాఖీ పండుగ విశిష్టమైనది ఎందుకంటే శ్రవణం, పౌర్ణమి ,గురువారం వచ్చింది  గురువారం ను లక్ష్మీవారం అంటారు. అందువల్ల ఈ మూడు కలిసిన రోజు కాబట్టి అంత విశిష్టత ఉంది. అంతేకాక ఇదే రోజున ఆయుష్మాన్ యోగం కూడా ఉంది. ఈ ఆయుష్మాన్ యోగం గురువారంరాత్రి  11:50 నిమిషాల నుండి రాత్రి 12 గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్ర హోర కూడా ఉంటుంది.

ఈ సమయంలో రాఖీ కట్టాలనుకున్నవారు ,సోదరులకు రాఖీ కట్టడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో సుఖ ,సంతోషాలతో సంవత్సరమంతా ఉంటారు. అంతేకాక కట్టిన వారికి పుట్టింటి నుంచి సహాయ సహకారాలు, వృద్ధి పొందుతారు. కట్టించుకున్న వారికి దుర్మరణం, ఆపదలు, గండాలు తప్పుతాయి. అందువల్ల ఈ సంవత్సరం జరుపుకునే రాఖీ పండుగకు అంతా విశిష్టత ఉంది.