Rashmika: రిషబ్ శెట్టి గురించి పాజిటివ్ గా మాట్లాడిన రష్మిక

నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన. ఈ పేరుని టాలీవుడ్ కి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో, తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉం ది. తన అందంతో, పర్ఫామెన్స్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది రష్మిక.

రష్మిక మందన రీసెంట్ గా నటించిన పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. అలాగే కొద్ది కాలంగా వరుస వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. సౌత్ సినిమాల గురించి, హీరోల గురించి బాలీవుడ్ లో మాట్లాడడం ద్వారా వివాదాల్లో చిక్కుకుంది.

తన మాతృభాష కన్నడ సరిగా మాట్లాడడం రాదు అని చెప్పిన మాట కూడా వివాదానికి దారి తీసింది. అదేవిధంగా కన్నడ భాషలో సూపర్ హిట్ అయినా “కాంతారా” మూవీ తను చూడలేదని చెప్పినా విషయం కూడా వివాదానికి దారి తీసింది. రష్మిక మందన సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేసిన డైరెక్టర్ రిశబ్ శెట్టి, హీరో రక్షిత్ శెట్టి గురించి ఎక్కడ కూడా చెప్పకపోవడం, గుర్తు చేసుకోకపోవడం ద్వార కూడా రష్మిక చిక్కుల్లో పడడానికి కారణమైంది.

రిషబ్ శెట్టి గురించి పాజిటివ్ గా మాట్లాడిన రష్మిక
రిషబ్ శెట్టి గురించి పాజిటివ్ గా మాట్లాడిన రష్మిక

ఇలాంటి కారణాల వల్ల కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కన్నడ సినీ ఇండస్ట్రీ రష్మిక మందనాన్ని బ్యాన్ చేస్తుంది అన్న వార్త కూడా హల్చల్ చేసింది. ఈ వార్తలో ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇలాంటి వార్తలు ప్రస్తుతం కూడా వినిపిస్తూనే ఉన్నాయి. “వారీసు”అనే మూవీలో రష్మిక హీరోయిన్గా చేసింది.

ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కూడా కన్నడలో తగ్గినట్లుగా సమాచారం. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా రష్మిక మందన తనని సినీ ఇండస్ట్రీకి మొదటిగా పరిచయం చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి, హీరో రక్షిత్ శెట్టి లే అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఇద్దరూ తనను” కిరిక్ పార్టీ”అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారంటూ ఓ ఇంటర్వ్యూలో వారిద్దరి గురించి మాట్లాడింది రష్మిక మందన.
ఆ ఇద్దరి వల్లనే నేను నాలుగు భాషల్లో నటించగలుగుతున్నాను అంటూ చెప్పకు వచ్చింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నాపై చాలా రకరకాల రూమర్స్ అనేటివి వస్తున్నాయి.

వీటిని నేను సహించను అంటూ చెప్పింది. ఇద్దరి గురించి రష్మిక పాజిటివ్గా చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిశాక కొంతమంది రిషబ్ శెట్టి కి భయపడే పాజిటివ్ గా మాట్లాడింది అంటూ అనుకుంటున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker