5G సేవలపై పంద్రాగస్టు న ప్రకటన చేయనున్న జియో నెట్వర్క్
భారతీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది జియో నెట్వర్క్. అంతకు ముందు ఉన్న 3G నెట్వర్కు పోటీగా రిలయన్స్ జియో 4G నెట్వర్క్ ను 2019 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి దేశంలో మొబైల్ వినియోగదారులందరినీ తమవైపు తిప్పుకున్నది. తద్వారా టెలికాం రంగంలో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది. 4Gనెట్వర్క్ వలన డేటా యొక్క వేగం స్పీడుగా, కమ్యూనికేషన్ వేగవంతంగా, చాలా సులువుగా మారిపోయింది.ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడు 4G సేవలకే అలవాటు పడే విధంగా మార్చి వేసిన ఘనత రిలయన్స్ జియో నెట్వర్క్ ది.తాజాగా రిలయన్స్ జియో నెట్వర్క్ సంచలన ప్రకటన చేసింది.దేశంలో త్వరలో కొన్ని సెలెక్టెడ్ నగరాలలో తమ యొక్క 5Gనెట్వర్క్ ను ఏర్పాటు చేస్తుందని, 5G sims దేశీయంగానే తయారవుతున్నాయని, త్వరలోనే ప్రయోగాత్మకంగా ఎంచుకున్న నగరాలలో అమలు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.ఇదే కనుక నిజమైతే భారతదేశంలో టెలికాం రంగంలో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టినట్టే అని సగటు మొబైల్ వినియోగదారుడు ఆశిస్తున్నాడు. భారతదేశంలో ఇప్పటికే 5Gసేవలకు గాను స్పెక్ట్రం వేలం ముగిసింది. ఎయిర్టెల్ తో పాటు జియో నెట్వర్క్ కూడా తమ తమ నెట్వర్క్ సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇక 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవం నేపథ్యంలో రిలయన్స్ నెట్వర్క్ ఆగస్టు 15వ తేదీ నుంచి తమ 5G సేవలు ప్రారంభిస్తాయని ఊహాగానాలు జోరందుకున్నాయి.5G స్పెక్ట్రమ్ వేలంలో జియో నెట్వర్క్ టాప్ బిడ్డర్ గా నిలిచింది. 24,740 మెగా హెడ్జ్ ను జియో నెట్వర్క్ 88,078 కోట్లకు దక్కించుకుంది.ఈ పరిణామాలని చూస్తుంటే త్వరలోనే దేశంలో రిలయన్స్ 5G నెట్వర్క్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.