Site icon ట్రెండింగ్ వార్తలు

Samanta: వైరల్ అవుతున్న సమంత పోస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ సమంత. సినీ ఇండస్ట్రీకి సమంత పేరును మళ్లీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు హీరోయిన్గా. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది సమంత.

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో కూడా ఒకరు. స్టార్ హీరోయిన్స్ లో కూడా ఒకరు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు సమంత. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తనదైన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూ వస్తుంది.

వైరల్ అవుతున్న సమంత పోస్ట్

సమంతా కి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది అని, దానికోసం తగిన చికిత్స తీసుకుంటుందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సమంత తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందరూ కూడా ఈ విషయం గురించే చర్చిస్తున్నారు.

కొద్దికాలంగా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన కొత్త మూవీ”శాకుంతలం”కి సంబంధించిన అప్డేట్స్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ పేజీలో సమంత చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తాను పెంచుకుంటున్న రెండు కుక్కలు హ్యాష్, షా షా.

ఈ రెండింటితో దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన పెంపుడు కుక్కలలో ఒకటైన హ్యాష్ సమంతతో చెప్తున్నట్లు”బాధపడకు అమ్మ.. నేను నీ వెనకే ఉన్న.. అంటూ ఉన్న ఒక మెసేజ్ ని తన ఇంస్టాగ్రామ్ పేజీలో తన పెంపుడు కుక్కలలో ఒకటైన హ్యాష్ సమంతతో చెప్తున్నట్లు ఈ మెసేజ్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ ఫొటోస్ ని ఈ మెసేజ్ ని చూసిన నేటిజన్స్ చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మయాసైటిస్ వ్యాధి చికిత్స కోసం కొన్ని నెలలపాటుగా టైం కేటాయించింది సమంత. ఇందుకోసం కొద్ది కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. తన కొత్త మూవీ”శకుంతల”ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చింది.

ఒకవైపు మయాసైటిస్ వ్యాధితో బాధపడుతూ, మరోవైపు తన వ్యక్తిగతంగా జరిగిన కొన్ని విషయాల గురించి బాధపడుతూ, ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా వస్తున్న ట్రోలింగ్ స్ గురించి బాధపడుతూ ఉంది. ఇలాంటి సిచువేషన్ లో ఈ పోస్ట్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకోవడం ద్వారా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.