పాములు మానవులకు శత్రువులా, మిత్రువులా?

పాశ్చాత్య దేశాలలో పాములను క్షుద్ర శక్తులుగా చెడుకు సంకేతంగా భావిస్తారు. కానీ మన భారతదేశంలో ఇతిహాసాలు, పురాణాలలో, గ్రంథాలలో,వేదాలలో సర్పాలకు ప్రముఖ స్థానం కల్పించారు. భారతీయులు సర్పాలను దేవతగా,ఇంటి ఇలవేల్పుగా పూజిస్తారు. అలాగే గుడులు కట్టి ఆరాధిస్తారు.

నాగపంచమి, నాగుల చవితి అను పండుగలు కూడా జరుపుకుంటారు. అంతటి విశిష్టత గల పాములకు జూలై,16 వ తేది ప్రపంచ పాముల దినోత్సవం గా గత ఏడాది నుంచే నిర్వహిస్తున్నారు.

పాములు కాళ్లు లేని, పొలుసులు గల సరిసృ పాలు వీటికి చెవులు ఉండవు కాని వీటి పొలు సుల ద్వారా స్పర్శ జ్ఞానం కలిగి ఉంటాయి. కొన్ని పాములు ఉభయచరాలు అనగా నీటిలో ఉంటాయి, మరియు నేలపై నివసిస్తాయి. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 2900 జాతులను గుర్తించడం జరిగింది.అలాగే భారతదేశంలో సుమారు 300 జాతులను గుర్తించడం జరిగింది.

పాములు అన్నియు విష సర్పాలు కావు వీటిలో ఎక్కువ విషం గలవి, మద్యస్థవిషం గలవి, విషం లేనివిగా ఉన్నాయి. భారతదేశంలో 60 జాతులలో విషం గలవి, 40 కి పైగా జాతులలో మద్యస్థ విషం గలవి, 180 జాతులలో విషం లేని పాములు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు రకాల పాములలో విషం కలదు. అవి 1) రక్తపింజర/రాటిల్ స్నేక్, 2) నాగుపాము/నాజా నాజా, 3) కట్లపాము/కట్ల కట్ల 4) కింగ్ కోబ్రా. పాములు ఆహారంగా చిన్న చిన్న కీటకాలు, కప్పలను, ఎలుకలను,చిన్న చిన్న పాములను,మరియు పక్షుల గుడ్లను,పక్షులను తింటాయి. ఇలా ఆహారపు అలవాట్లు ఉండటం వలన రైతులకు పాములు నేస్తాలుగా ఉన్నాయి.అంటే రైతుల పైరులలో ఉండు చీడపురుగులను,కీటకాలను, ఎలుకలను పాములు తినడం వల్ల పంటకు కీటకాలు నుండి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ కారణం చే పాములను రైతు నేస్తాలు అని అనవచ్చు.

సాధారణంగా పాములు ఎవరికి హాని కలిగించవు కానీ ఇతరుల నుండి తమకు ప్రమాదం సంభవించినప్పుడు వారిపై దాడి చేస్తాయి. ఈ దాడి చేసే ముందుగా హెచ్చరికగా శబ్దాలు చేయడం, భయపెట్టడం లాంటివి చేస్తాయి తదనంతరం దాడి చేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో సంవత్సరానికి సుమారు 25 వేల మంది పాము కాటుకు గురవుతున్నారు. పాము కాటుకు చికిత్స పాము కాటు గురైన వారిని ఆందోళనకు గురి కాకుండా చూడాలి. ఎందుకనగా కాటు కు గురైన వ్యక్తి ఆందోళన చెందితే రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది అలాంటప్పుడు విషం నేరుగా రక్తంతో కలిసి గుండెకి చేరడం వల్ల ప్రమాదం సంబంవించును. విషం కు విరుగుడుగా యాంటీ వెనమ్ డోసును రెండు దఫాలుగా ఇవ్వాలి. హోమియోపతిలో నాజా అని గుళికలు నాలుగు చొప్పున చప్పరించాలి. ఈ గుళికలు ఎక్కువ మోతాదులో తీసుకోనరాదు. కారణం నాజా గుళికలు గుండెపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.చాలా ప్రాంతాలలో పాముకాటు విషానికి విరుగుడు లేకపోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రపంచంలో పొడవైన పాము అనకొండ ఇది సుమారు 6 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న పాము త్రెడ్ పాము ఇది 11 సెంటీమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో పాములు లేని దేశం ఐర్లాండ్. ఈ ఆధునిక కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు మానవుల, పాముల సంఘర్షణను తొలగించడానికి విశేషంగా కృషి చేస్తున్నాయి. అలాగే సర్పాల పట్ల మానవుల ఆలోచన విధానం మారే విధంగా కృషి చేస్తున్నాయి. సర్పాలను రక్షించే విధంగా తోల్పడుతున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker