Sreeja Konidela: వైరల్ అవుతున్న శ్రీజ పోస్ట్

కొంతకాలంగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో ఎప్పుడూ వినిపిస్తున్న ఒకే ఒక పేరు శ్రీజ. మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. ఆమె ఏ పోస్ట్ షేర్ చేసుకున్న సరే వెంటనే వైరల్ అవుతుంది.

ఎందుకలా వెంటనే వైరల్ అవుతుంది అంటే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు , ఆమె ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటుంది.తను ఏ మెసేజ్ ని షేర్ చేసుకున్నా సరే వెంటనే వైరల్ అవుతుంది. మొదట శ్రీజ ఒక అతడిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

కొంతకాలానికి అతనితో విడిపోయి కళ్యాణ్ దేవ్ నీ రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా దూరంగా ఉంటున్నట్లు, కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. శ్రీజ గాని, కళ్యాణ్ దేవ్ గాని సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు అన్న అనుమానం కలిగించే విధంగానే ఉన్నాయి.

వైరల్ అవుతున్న శ్రీజ పోస్ట్
వైరల్ అవుతున్న శ్రీజ పోస్ట్

ఇలాంటి సిచువేషన్ లో న్యూ ఇయర్ లో శ్రీజ పెట్టిన ఒక పోస్ట్ చాలా వైరల్ అయింది.”ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా”అంటూ శ్రీజ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేసింది. దీని తర్వాత”ఐ యాం లవింగ్ ది రిలేషన్షిప్ విత్ సెల్ఫ్”అంటూ పెట్టిన మరో మెసేజ్ కూడా తెగ వైరల్ అయింది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా శ్రీజ తన కాఫీ అలవాటు గురించి ఒక పోస్ట్ అనేది పెట్టింది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ఏంటి అనేది తెలుసుకుందాం.

“నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావు. జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావు. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే. నా 14 ఏళ్ల వయసులో నువ్వు పరిచయమయ్యావు. అప్పటినుంచి నాతోనే ఉంటున్నావ్. థాంక్యూ మై డియర్ కాఫీ”అంటూ తనకు కాఫీ పైన ఉన్న ఇష్టం నీ తెలియజేసింది శ్రీజ. తను కూడా ఒక కాఫీ లవర్ అని చెప్పుకొచ్చారు. తన కాఫీ అలవాటు గురించి తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది శ్రీజ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker