IND vs SL 3rd ODI: సాంప్రదాయ దుస్తులు శ్రీ పద్మనాభ స్వామిని దర్శించుకున్న టీమ్ ఇండియన్ క్రికెటర్స్
క్రికెట్ ఆటకు సంబంధించి శ్రీలంక జట్టుతో నామమాత్రంగా మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. మూడో వన్డే మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జనవరి 15వ తేదీ ఆదివారం జరగనుంది.
మూడో వన్డే మ్యాచ్ కు సంబంధించి న తుది జట్ల అంచనా-
టీమిండియా జట్టుకు సంబంధించిన ప్లేయర్స్-
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ.
శ్రీలంక జట్టుకు సంబంధించిన ప్లేయర్స్-
అవిష్క ఫెర్నాండో, నువా నిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), కుశాల్ మెండిస్(వికిట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణ రత్నే, వానిందు హస రంగ, కసున్ రజిత, లాహిరు కుమారా, దునిత్ వెలాలెజ్.
మూడో వన్డే మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని రోహిత్ సేన చాలా బలంగా కోరుకుంటుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు కూడా తిరువనంతపురం చేరుకున్నాయి. ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రాక్టీస్ రెండు జట్లు చాలా ముమ్మరంగా చేస్తున్నాయి.
ప్రస్తుతం టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది భారత క్రికెటర్స్ శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. టీమిండియా జట్టుకు సంబంధించిన”సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్ వంటి క్రికెటర్స్ పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ క్రికెటర్స్ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. వారు స్వామి దర్శించుకున్న తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోస్ కొన్నింటిని సోషల్ మీడియా వేదికగా ఈ క్రికెటర్స్ తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియానీ షేక్ చేస్తున్నాయి.