Site icon ట్రెండింగ్ వార్తలు

Viral News:, ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. రెండు మనసులను ఒకటి చేసే అపురూప ఘట్టం. సంసార జీవితంలో కష్టసుఖాలను పంచుకుంటూ వాటిని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యం జీవితాంతం తోడుగా నిలిచే అద్భుతంగా కొనసాగించే ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి.

ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన గలిగితే వారి యొక్క జీవితం సుఖవంతంగా ఉంటుంది. అప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో అయితే ఒకరిపై ఒకరికి ప్రేమ అదే ఒక వరంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఇలా ఒక సంగతి జరిగింది అది ఏమిటో చూద్దాం.UK చెందిన డేవిడ్ లాస్ట్ అనే వ్యక్తికి బర్త్డే గిఫ్ట్ అని ఆయన భార్య యపిల్ వాచ్ ని బహుమతిగా ఇచ్చింది.

ఒకవేళ హార్ట్ బీట్ వేగంగా ఎక్కువైందంటే ఆటోమేటిక్ గా (automatic)ఈ వాచ్ హెచ్చరించడం దీని ప్రత్యేకత.కొద్ది రోజుల క్రితం యపిల్ వాచ్ ధరించిన డేవిడ్ లాస్ట్ కు సెన్సార్ వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 3 వేల సందర్భాలలో తక్కువ హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన దంపతులిద్దరూ వైద్యుల్ని సందర్శించారు.

డేవిడ్ ఎగ్జామిన్ చేసిన డాక్టర్లు 48 గంట‌ల‌ పాటు వివిధ రకాల ప‌రీక్షలు చేశారు. ఆ స‌మ‌యంలో 138 సార్లు అతని గుండె ఆగిపోయే స్థితికి వ‌చ్చిన‌ట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే డాక్టర్లు గుండెల్లో పెద్ద బ్లాక్ ఉందని. ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీనికి అంగీకరించిన డేవిడ్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ చేసి పేస్ మేకర్ ను కూడా అమ‌ర్చారు.

అలా తన భార్య ఇచ్చిన గిఫ్ట్ తన పాలిట ఒక వరంగా మారిందని ఆయన తెలియజేశారు. తన ప్రాణాలను కాపాడిన యపిల్ వాచ్ ఎప్పటికీ తనతోనే ఉంచుకుంటానని డేవిడ్ బాగోద్వేగానికి గురయ్యాడు. తన భార్య లేకుంటే తన ప్రాణాలు దక్కేవి కాదని అతడు కన్నీళ్లు కార్చాడు. ఇద్దరు భార్య భర్తల మధ్య ఉన్నది ప్రేమ ఇలానే ఉండాలి. ఎప్పటికీ ఇలానే ఉంటే చాలామంది భార్య భర్తలు వీరిద్దరు లాగే జీవిస్తారు. ఇది వివాహ బంధానికి ఉన్న ఒక ప్రత్యేకత ఒక అద్భుతం అని చెప్పవచ్చు..