Viral Video: పెళ్లి కోసం వర్షంలో వరుడు పడుతున్న కష్టం

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు,వంకలు,నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీటిలో మునిగిపోవడం కూడా జరిగింది. ఇళ్ల లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు రోడ్డుపైకి సురక్షిత ప్రాంతాల్లోకి చేరుకోవాలని అనుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో జనజీవనం చాలా కష్టతరంగా మారుతుంది.

పెళ్లి కోసం వర్షంలో వరుడు పడుతున్న కష్టం

తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం,రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి దారుణంగానే ఉంది. ప్రజలు ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా అస్సాంలో వరదలు భారీగా నష్టాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు వందలాది మంది మరణించారు కూడా, ఇంకా లక్షలాదిమంది వాళ్లు బ్రతకడానికి ఎలాంటి ఆధారాలు లేక నిరాశ్రయులయ్యారు.

ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కూడా వివాహ వేడుక జరుపుకుంటే ఏ విధంగా ఉంటుందని ఊహించుకోండి. సహజంగానే అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వివాహ తేదీని వాయిదా వేసుకుంటారు. కానీ తాజాగా ఓల్డ్ పెళ్ళికి వెళుతున్న వీడియో నేట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పెళ్లికొడుకు అలంకరణలో వరుడు వరదలు దాటుకుంటూ వెళ్తున్నాడు.

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ,చాలా ఫన్నీగా ఉంది. వరుడు పైజామాను పైకెత్తి నదిని దాటుకుంటూ నెమ్మదిగా వెళుతున్న దృశ్యాలు వీడియోలో మనం చూడవచ్చు.అతను కూడా నది నీటిలో పడిపోతాడేమోనని భయంతోనే దాటుతున్నాడు.

అయితే మరొక వ్యక్తి వరుడిని పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అంతే కాదు వరుడు వెనుక మరికొందరు బంధువులు,అమ్మాయిలు కూడా వరద నీటిలో దిగి నడుస్తున్నారు. తుఫానులు,వరదలు ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా పెళ్లికి అడ్డు కాదని నిరూపించడం జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమైన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.nareshsharma5571 అనే అనే ఖాతాలో షేర్ చేశాడు. మేమంతా కలిసి మెలిసి అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. ఈ వైరల్ అవుతున్న వీడియో కి ఇప్పటికే 6.5 మిలియన్లు అంటే 65 లక్షల వ్యూస్ రావడం జరిగింది. అయితే 1,32,000 మందికి పైగా లైక్ చేశారు కూడా. పెళ్లికి తేది మార్చు అన్నయ్య ఒకరంటే,పెళ్లికి కూతురు ఎలా వెళ్తుంది అంటూ ఇంకొకరు,ఇది నిజమైన ప్రేమ అని మరికొందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker