Viral Video: సింహాలకు చుక్కలు చూపించిన హిప్పో,వీడియో వైరల్

అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం,అయితే ఆ రాజును కూడా సుస్సు పోయెంచే కొన్ని జంతువులు వుంటాయి . ఏంటి నమ్మట్లేదా.! గజరాజు లేదా హిప్పోపొటామాస్ లాంటి భారీ జంతువులు సింహాలను పరుగులు పెట్టిస్తాయి. అందుకు నిదర్శంగా నిలిచే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.

సింహాలకు చుక్కలు చూపించిన హిప్పో,వీడియో వైరల్

కొన్ని సందర్భాలలో మనం బలవంతులం అని మురిసిపోతూ ఉంటాం. అడవికి రాజు సింహం అయినప్పటికీ కూడా దానికి కొన్ని జంతువులను చూస్తే అది భయపడుతుంది.ఓ హిప్పో నదిని దాటుతుండగా అటుగా వెళుతున్న నాలుగు సింహాలు దాన్ని చూస్తాయి. పక్కా స్కెచ్ వేసి మరి దాని ఎరగా చేసుకోవాలని నీళ్లలోకి దిగుతాయి.

ఒక్కసారిగా నాలుగు సింహాలు యుద్ధంలోకి దిగుతాయి. సింహాలు యుద్ధ దండన చేస్తాయి. దండేత్తినా తర్వాత హిప్పో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వాటిపైకి దాడికి దిగింది. అంతే ఇంకా దెబ్బకు సింహాలు సుస్సు పోసుకున్నాయి. నీటిలో నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకున్నాయి.

ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సింహం పులి బలం కంటే హిప్పో బలం చాలా తక్కువ. అందుకేనేమో మృగరాజు ఆ బలమైన జంతువులకు భయపడి పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కాస్త పాత వీడియో అయినా మరోసారి నెట్టింట చెక్కర్లు కొడుతుంది.

లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒక లుక్కేయండి.. బలవంతులమని ఎప్పుడు మనం అనుకోకూడదు. అలా అనుకుంటే చాలా అహంకారం అవుతుంది. ఎంత బలము ఉన్నప్పటికీ కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. చూశారుగా ఈ వీడియోలో అడవికి రాజు సింహం అయినప్పటికీ కూడా ఇప్పుడు చేతులలో ఓడిపోసాగింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker