Viral Video:మానవత్వం అంటే ఇదేనేమో, ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడారు
సాధారణంగా మనం జంతువులను రక్షిస్తుంటాం. ఎవరైనా తమ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను ఇతరుల ప్రాణాలను కాపాడడం అనేది అంత సులభమైన పని కాదు. ఇది చాలా కష్టమైన పని. మూగ జంతువులను కాపాడటం అనేది చాలా క్లిష్టమైనది. ఇది ఒక ప్రత్యేకమైనది. ఎందుకనగా కొంతమంది పిల్లలు కుక్కను కాపాడటం దీనిలో ప్రత్యేకత.
కొండచిలువ కుక్కను పట్టుకొని మింగేయాలని చూసింది. అక్కడున్న పిల్లలు కొండచిలువ నుంచి కుక్కను కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. కుక్కను కాపాడడానికి తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతో ధైర్యంతో, సాహసంతో పోరాడారు. మానవత్వానికి ఒక మాదిరిగా నిలబడ్డారు.కొండచిలువను చూసి బలవంతులమని అనుకున్న వాళ్లు కూడా పారిపోయారు.
కానీ ఆ ముగ్గురు పిల్లలు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కొండచిలువతో పోరాడారు. ఆ ముగ్గురు పిల్లలు యొక్క కుక్కను కాపాడడం కోసం పెద్ద ఒక యుద్ధం చేశారని చెప్పవచ్చు.కొండచిలువ ఆ కుక్కను వేటాడే విధానం వీడియోలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో చూడవచ్చును. కుక్క పూర్తిగా కొండచిలువ పట్టులో ఉండిపో సాగింది. కొండచిలువ నుండి విడిపించుకోవాలని ఆ కుక్క ఎంతో ప్రయత్నం చేసింది.
కానీ అది సాధ్యపడలేదు ఎందుకంటే కుక్క యొక్క శక్తి సామర్థ్యం సరిపోలేదు.అంతలోనే ఆ ముగ్గురు యొక్క పిల్లల కంటిలో ఈ దృశ్యం పడింది.వెంటనే ఆలోచించకుండా తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా ఆ కొండచిలువతో పోరాడటానికి సిద్ధమయ్యారు. ఆ ముగ్గురు పిల్లలలో ఒకరు రాయి తీసుకున్నారు.
మరొకరు కర్ర తీసుకున్నారు . మూడో పిల్లవాడు నోరు గట్టిగా పట్టుకున్నారు. అయితే ఆ ముగ్గురు కలిసికట్టుగా కొండచిలువ భారీ నుండి కుక్కను విడిపించారు. ఆ ముగ్గురు పిల్లలు కలిసి ఒకేసారి కొండచిలువ మీద పోరాడారు. చాలా కష్టం మీద కొండచిలువ నుండి కుక్కను విడిపించారు. కొండచిలో భారీ నుండి తప్పించుకున్న కుక్క ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కొండచిలువ బతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇది వీడియో వైరల్ గా మారింది.
ఐకమత్యమే మహాబలం ఆ ముగ్గురు పిల్లల నుండి మనం నేర్చుకునే గుణపాఠం అని చెప్పవచ్చు.