Vira News: హోంవర్క్ ఎగ్గొట్టడానికి ఎంతో పెద్ద కారణం చెప్పిన బుడ్డోడు
బాల్యం ఎప్పుడు ఎవరికైనా ఒక మధురానుభూతి. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే సమయంలో సంఘటనలు స్నేహం స్నేహితులతో మధురమైన జ్ఞాపకాలగా జీవితాంతం గుర్తు ఉండిపోతాయి. స్కూల్ డేస్ లో హోంవర్క్ ని ఎగ్గొట్టడానికి ఏదో ఒక సాకు లేదా ఏదైనా రీజన్ చెప్పి ఉంటారు.
ఒక్కొక్కసారి అవి గుర్తుకొచ్చిన పెదవులపై చిరునవ్వు కలుగుతుంది. చిన్నతనంలో చదువుకోవాలన్న రాయాలన్న కష్టంగా అనిపిస్తుంది. ఎంతసేపు ఆటలవైపు మనసు తిరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇలా ఎప్పుడు సమయం దొరికిన హోంవర్క్ ఎగ్గొట్టి మరీ ఆడుకోవాలని చూస్తారు.
అందుకని వాళ్ళ అమ్మ తమ పిల్లలకు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయించడానికి ప్రయత్నిస్తుంటారు. దగ్గర కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అప్పుడు పిల్లల మనసు ఆటలాడుకోవడం వైపు తిరిగితే అమ్మకు రకరకాల సాకులు చెప్పి హోంవర్క్ చేయకుండా పారిపోతారు.
ఇప్పుడు అలాంటి వీడియో చిన్నారి సాకు వెలుగులోకి వచ్చింది. అది తెలిస్తే.. మీరు పడి పడి నవ్వుతారు. హోంవర్క్ సమయంలో పిల్లవాడు తన తల్లి ముందు ముక్కులో టిష్యూ పేపర్ పెట్టుకొని కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. దీంతో తాను చదువుకోవాల్సిన పుస్తకం పక్కన పెట్టి బయటికి వెళ్లడానికి ప్రయత్నం చేశాడు.
దీంతో ఆ బాలుడి తల్లి ఏమి జరిగిందని అడిగింది వెంటనే ఆ పిల్లవాడు తన పుస్తకాల వాసన పడడం లేదని ఎలర్జీ తల్లికి చెప్పాడు. అంతేకాదు ఆ పిల్లవాడు హోంవర్క్ చేయలేదని కూడా ఆ తల్లికి చెప్పాడు,ముద్దు ముద్దుగా చెప్పాడు. తన కొడుకు కారణం విన్న తల్లి ఆలోచనలో పడింది.
గత ఐదేళ్లలో ఎప్పుడూ పుస్తకాల స్మెల్ తో ఎలర్జీ లేదని కదా.. మరి ఇప్పుడు ఎలా జరిగింది? ఆలోచించింది. వెంటనే చిన్నారి విషయం సీరియస్ గా తీసుకున్న తల్లి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పింది. తల్లి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తానంటే. బాలుడు నో అని అన్నాడు.దీంతో తల్లికి తన కొడుక్కి ఇక జిమ్మిక్కులు చేయడం మానేసి సైలెంట్‌గా హోంవర్క్ చేయమని చెప్పింది..