బుల్లితెర యాంకర్లలో గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మీ. తాజాగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రష్మీ గ్రాండ్ మదర్ శుక్రవారం రోజు మరణించారు. ఆమె పేరు ప్రమీల మిశ్రా. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది రష్మి.
బరువెక్కిన గుండెతో మా గ్రాండ్ మదర్ కి కడసారి కన్నీటి వీడ్కోలు పలికాము అంటూ తెలియజేసింది.”ప్రమీల మిశ్రా ఒక స్ట్రాంగ్ ఉమెన్. మాపై ఆమె ప్రభావం చాలా ఉంది. ఆమె జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి.
ఓం శాంతి”అంటూ తన గ్రాండ్ మదర్ గురించి రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంది. బుల్లితెర యాంకర్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది రష్మి . జబర్దస్త్ షోలో తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంది.
ప్రతి ఎపిసోడ్ లో కూడా రకరకాల కాస్ట్యూమ్స్ లో వస్తూ డిఫరెంట్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో కూడా రష్మీ యాక్టివ్ గా ఉంటారు. రకరకాల కాస్ట్యూమ్స్ లో ఫోటోషూట్స్ చేసుకుని తన అభిమానులతో, ఫాలోవర్స్ తో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటుంది.
జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బాగా ఫేమస్ అయ్యింది.ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైనప్పటికీ జబర్దస్త్ షో ద్వారా మాత్రమే బాగా గుర్తింపు సంపాదించుకుంది రష్మీ. ఒక్కో షో కి 1.5 నుంచి 2 లక్షల వరకు పారితోషకం తీసుకుంటుందట.
ఇవే కాకుండా అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, స్పెషల్ షోస్ చేస్తూ బాగానే డబ్బులు తీసుకుంటుంది. రష్మీ ఎక్కువగా సమాజంలో జరిగే విషయాలపై ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది. మహిళలపై జరిగే రేపులపై , మూగజీవాల సంరక్షణ విషయంలో ఎప్పుడు ఏదో ఒక విధంగా స్పందిస్తూ ఉంటుంది రష్మీ.
ఒకవైపు ఏదో ఒక ఈవెంట్తో, షోలలో హోస్టింగ్ చేస్తూ మరోవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. రశ్మి”బొమ్మ బ్లాక్ బస్టర్”అనే మూవీ చేసింది. దీని తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న”బోలా శంకర్”అనే మూవీలో కూడా నటిస్తుంది రష్మి. ఇవే కాకుండా మరికొన్ని ఆఫర్లతో బిజీగా ఉన్నట్టు సమాచారం.