Viral Video: ఉక్రెయిన్ అమ్మాయికి, రష్యా అబ్బాయికి పెళ్లి వేదికగా ఇండియా

ప్రపంచంలో చాలా ప్రేమలు ఉంటాయి.అయితే ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమకు మనస్పర్ధలు అనేటివి ఉండవు. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించింది. ప్రేమలో ఆప్యాయత అనురాగాలు ఉండాలి అలా ఉన్నట్లయితే ప్రేమ బలంగా ఏర్పడుతుంది.ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. కలిసిన రెండు మనసులకు ఎలాంటి పరిస్థితులు ఉన్న వాటిని ఎదుర్కొనగలిగే శక్తి ఉంటుంది. అలాంటి ప్రేమలు స్థిరంగా ఉంటాయి. ప్రేమ కోసం యుద్ధం చేయాల్సి వచ్చిన వెనుకంజ వెయ్యరు.

కానీ యుద్ధంలోనే పుట్టిన ప్రేమ సరిహద్దులు ఉండవు వాటిని దాటి అయినా సరే పెండ్లితో గెలవాలనుకుంటారు. తమ ప్రేమకు ఎలాంటి ఆంక్షలు హద్దులు లేవు అని నిరూపించారు. ఓ జంట ఓవైపు తమ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా మరో దేశమైన భారతదేశంలో వారు పెళ్లి చేసుకున్నారు.ప్రేమకు ఎలాంటి కులాలు కానీ మతాలు కానీ అడ్డు ఉండకూడదని ఈ జంట ద్వారా తెలుసుకోవాలి.

ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. రష్యా కు చెందిన సెర్గినోవికో ఉక్రెయిన్ కు చెందిన అమ్మాయి ఎలా నా బ్రీమెక గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారు. అయితే కొద్దిరోజు కొద్ది నెలల కిందట ఈ సంగతి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే కదా. వీరి ప్రేమను గెలిపించడం కోసం హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాలలో హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ ఒక సంవత్సరం కాలం ఉందా ధర్మశాల నివసిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ కి చెందిన శర్మ అతని యొక్క కుటుంబ సభ్యులు వీరిద్దరు పెళ్లికి కన్యాదానంతో పాటు అనేక వివాహ సాంప్రదాయ ఆచారాలు లో పాల్గొన్నారు వచ్చారు.వీరిద్దరి వివాహానికి విదేశీయులు వచ్చి ఆ ప్రేమ జంటను ఆశీర్వదించారు. సత్తన్న ధర్మ సంప్రదాయాల్లో పెండ్లి యొక్క వివరణ మరియు సంప్రదాయాలు కట్టుబాట్లు గురించి వివరించారు. దాంపత్య జీవితం ఎలా ఉండాలో వారికి బోధించాడు. పెళ్లి యొక్క ప్రాముఖ్యత వారికి తెలియజేశాడు ఆ దివ్య ఆశ్రమంలో పండితుడు సందీప్ శర్మ చెప్పారు.

అలాగే వారిద్దరూ ఎన్నో శ్లోకాలు మరియు మంత్రాలు పాటించారు వాటిని అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపించారని చెప్పారు. జీవితకాలం కలిసి మెలిసి ఉండాలని వారిని ఆశీర్వదించాడు. పెళ్లి అనేది నూరేళ్ల బంధం. దీనిలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సుఖదుఃఖాలలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా భాగాలు పంచుకోవాలని ఆదేశించారు. పెళ్లి అనేది ఒక మూడుముళ్ల బంధం ఏడు జన్మల అనుబంధం మరియు ఏడు అడుగుల అనుబంధం అని ఆయన చాలా చక్కగా వారిద్దరికీ జీవితం కొనసాగించాలని వారికి చెప్పారు.

ఉక్రెయిన్ మరియు రష్యాలా మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతున్నప్పటికీ కూడా యుద్ధానికి దూరంగా తమ ప్రేమను పెళ్లితో గెలిపించుకోవాలన్న తపనతో ఈ జంట వివాహం చేసుకున్నారు.వీళ్ళిద్దరూ ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అని వారి దేశానికి ఒక స్ఫూర్తిగా ఉండి పోసాగారు అలా ఉంటే ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.ఈ జంట వివాహం చేసుకున్న ఫోటోలు మరియు వీడియోలు నెటిజన్లో ముందు వైరల్ గా పోతున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker