2023 సంవత్సరంలో సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి హీరోగా నటించిన “వాల్తేరు వీరయ్య”మూవీ రిలీజ్ అయింది. సరైన సినిమా ఇది అంటూ మెగాస్టామినాగురించి మరోసారి రుజువు చేసింది వాల్తేరు వీరయ్య మూవీ.
సరైన సినిమా వస్తే రికార్డు సృష్టించాల్సిందే. నైజాంలో వాల్తేరు వీరయ్య మూవీ 25 కోట్లు షేర్ సాధించింది. రీసెంట్గా సర్కారు వారి పాట, బిమ్లా నాయక్ కలెక్షన్స్ ని కూడా దాటుతుంది అంటున్నారు. ఇంకో రెండు లేదా మూడు కోట్లు వసూలు చేసింది అంటే ఆ మూవీస్ కలెక్షన్స్ ని దాటేసినట్టే.
ఇప్పటికే విశాఖలో సర్కారు వారి పాట మూవీ వసూలు చేసిన కలెక్షన్స్ ని దాటేసింది వాల్తేరు వీరయ్య మూవీ. విశాఖలో భీమ్లా నాయక్ మూవీకి ఏడెనిమిది కోట్లు కూడా వసూలు కాలేదు. అదే ప్రాంతంలో వాల్తేరు వీరయ్య మూవీ 12 కోట్లు వసూళ్లు దాటేసింది.
ఈ రెండు మూవీస్ తో ఎందుకు పోల్చారంటే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయిన ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అలాగే సర్కారు వారి పాట మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అలాంటిది ఈ రెండు మూవీస్ ని వాల్తేరు వీరయ్య సులువుగా దాటేసింది.
నైజాం, వైజాగ్ ఈ రెండు ప్లేసుల్లోనే కాకుండా దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి సిచువేషన్ ఉంది అంటున్నారు. వైజాగ్ ఏరియాలో కూడా బాలయ్య వీర సింహారెడ్డి మూవీ రికార్డు స్థాయిలో వసూలు రాబట్టింది.
అదే ప్లేస్ లో వారసుడు మూవీ రెండు కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్ తర్వాత అన్ని మూవీస్ గురించి చూస్తే వాల్తేరు వీరయ్య చాలా రికార్డులని దాటేసే అవకాశం కూడా ఉంది.
మెగా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను కట్టిపడేయగల విధంగా ఈ మూవీలో మూమెంట్స్ ని రూపొందించాడు దర్శకుడు బాబి. దేవి శ్రీ ప్రసాద్ మంచి ఆడియో ఈ మూవీకి అందించారు. ఈ కారణాల వల్లనే ఈ టైప్ ఆఫ్ రికార్డ్ సృష్టించగలిగింది ఈ మూవీ.